MGU university : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తాజాగా కృష్ణవేణి బాలికల వసతి గృహం లో ఉదయం అల్పాహార సమయం లో గొడ్డుకారంతో అన్నం పెట్టిన సంఘటనపై టిఆర్ఎస్వి నాయ కులు విసి ని కలిసి ఫిర్యాదు చేశారు. సంఘటన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందగా వారికి బిఆర్ఎస్వి అండగా ఉంటుందని చెప్పి విద్యార్థులతో కలిసి మహాత్మగాంధీ వైస్ చాన్సలర్ డాక్టర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ కు BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగా ర్జున ముదిరాజ్ వినతిపత్రం అందజేశారు.
ఇలాంటి సంఘ టనపై పూర్తి విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులపై చర్యలు తీసు కొని భవిష్యత్తులో ఇలాంటి సం ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనికి సానుకూలంగా స్పందించిన విసిగారు తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాన ని హామీ ఇవ్వడం జరిగింది కావున విద్యార్థులకు అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా వి సితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు బి ఆర్ ఎస్ వి నిరంతరం అండగా ఉంటుందన్నా రు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చల్ల కోటేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల క్రాంతి యాదవ్, తెనాలి సైదిరెడ్డి, బత్తుల బంగారు యాదవ్, నడి శంకర్, యుగంధర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.