Micro Finance: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహిళలు ఆర్థిక సమస్యల (Women’s economic problems)తో సతమతమవుతూ మైక్రో ఫైనాన్స్ బారినపడి అప్పుల ఊబిలో మునిగిపోతున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బి టి ఎస్ ప్రాంతంలో మహిళల మైక్రో ఫైనాన్స్ (Micro Finance)సంస్థల ద్వారా ఏ రకంగా అప్లోడ్లో కొట్టుకుపోతున్నారో సమగ్ర సర్వే (A comprehensive survey) ద్వారా సమస్యలను సేకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే పావలా వడ్డీ రుణాలు వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ సెక్టార్లను (Micro Finance Private Sectors) ఆశ్రయిస్తున్నారని దీనికి అత్యధిక ఖర్చుపెట్టి అప్పుల పాలు అవుతున్నారని అన్నారు. నల్లగొండ పట్టణంలో ఫెడరల్ బ్యాంకు బంధన్ బ్యాంకు లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వివిధ వృత్తు దారుల మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదని బడ్జెట్లో (In the budget)కేటాయించి ప్రభుత్వ రంగాన్ని బలోపేది చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. నల్లగొండలో ఫెడరల్ బ్యాంకు ఈ సబ్బు బ్యాంకు లాంటివి మహిళల వద్ద అత్యధిక వడ్డీ వసూలు చేసి దోపిడీ చేస్తున్నారని అన్నారు. మహిళలంతా ఐక్యమై ఈ మైక్రో ఫైనాన్స్ (Micro Finance) ఆగడాలను అరికట్టడానికి పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.