–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన నల్గొండ :ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) అన్నారు. శనివారం నల్గొండ లోని తన క్యాంపు కార్యాలయం (Camp Office) సమీపంలో గల మున్సిపల్ పార్కులో ప్రజల సమస్యలకు సంబంధించి వినతులను స్వీకరించారు. పలువురు సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అక్కడికక్కడే పరిష్కరించారు. వివిధ సమస్యలకు సంబంధించి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) వద్దకు వచ్చి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు, వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం (Solving problems) కోసం కృషి చేస్తానని అన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా అధికారులంతా తమ వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt) ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉండి ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ (Nalgonda Municipal) చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.