Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Bhupal Reddy: దివ్యాంగులను అవహేళన చేస్తే తాటతీస్తాం

— నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

MLA Bhupal Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఐఏఎస్ (ias) అందుకే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారిగా ఉండి, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లా డడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Bhupal Reddy) అన్నారు. వికలాంగుల విషయములో నీ భర్త ఐపీఎస్ నువ్వు ఐఏఎస్ అందుకే కళ్ళు నెత్తికెక్కి మాట్లా డుతున్నావని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal)పై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగా న్ని కాపాడాల్సిన ఓ అధికారిగా ఉండి, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. స్మితా సబర్వాల్ ఓ దివ్యాంగులకి జన్మనిచ్చి ఉంటే వారి కష్టాలు ఏంటో ఆమెకు తెలిసేవని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

దివ్యాంగులను అవహేళన (Mocking the disabled)చేసి. వారి మనో ధైర్యాన్ని దెబ్బతినేలా కుట్ర చేస్తున్న స్మితా సబర్వాల్ మెంటల్ గా అన్ ఫిట్ అని. ఐఏఎస్ గా పనికి రాదని వెంటనే ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకో వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆయన కోరారు.ఎన్నో ఆటుపో ట్లను కష్టనష్టాలను ఎదుర్కొని బాల లత లాంటి ఓ దివ్యాంగ మహిళ ఐఏఎస్ కాగలిగారని, తనతో పాటే ఎంతోమందిని ఐఏఎస్ లుగా త యారు చేసేందుకు ఐఏఎస్ అకా డమీ ద్వారా ఎంతోకృషి చేస్తున్నా రని ఆయన బాలలత లాంటి వారి ని ఆదర్శంగా తీసుకోవాల్సింది పో యి దివ్యాంగులనే హేళన చేయడం సరి కాదన్నారు ప్రపంచమే గర్విం చదగ్గ ఎంతోమంది దివ్యాంగులు ఉన్నా రని, అటువంటి వారిని అవమానించడం సరికాదని ఆయన హితువు పలికారు.