Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Jagdish Reddy: రాష్ట్రంలో డెకాయిట్ల పాలన

— మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్

MLA Jagdish Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని అనడం చేతకాని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) నేడు బిఆర్ఎస్ అధి నేత‌ కేసీఆర్‌పై పడి ఏడుస్తున్నార ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జ‌గ‌దీష్ రెడ్డి (MLA Jagdish Reddy) ధ్వజమెత్తారు. డ బ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టు బడిన వారు మీవాళ్లయితే, కేసీఆర్ పదేళ్లు ప్రజాసంక్షేమం కోసం పాటు పడిన వ్యక్తి అని పేర్కొన్నారు. శని వారం ఆయన న‌ల్గొండ‌లో మీడి యాతో మాట్లాడుతూ ఉత్తమ్ కు మార్ రెడ్డి తన భాషను మా ర్చు కుంటే మంచిదని హితవు పలి కారు.

మీకంటే వెనుక వచ్చినవాడు మీకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పదవి గుంజుకుంటే చూస్తూ ఊరు కున్న చేతకాని దద్దమ్మగా ఉత్తమ్ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేవంత్‌కు (revanth) పడ్డ చివాట్లు మీకు తప్పవని ఉత్తమ్‌ను హెచ్చరించారు. ఆయన ఇలాగే తిడుతుంటే చీవాట్లు పడ తాయని, కానీ ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా అధికార పార్టీ వారి కమీషన్లు, దోపిడీ గురించే ప్రజలు చర్చిం చుకుంటున్నారన్నారు. తమ హయాంలో రైతులకు (farmers) ఇబ్బందులు లేకుండా నీటిని, విద్యుత్‌ను అందించామన్నారు. కానీ ఇప్పుడు నీటి కోసం, విద్యుత్ కోసం ధర్నా లు జరుగుతున్నాయన్నారు. సాగునీటి కోసం ధర్నాలు కొనసా గితే యాసంగి నాటికి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ (uttam) విఫలమయ్యారని వ్యా ఖ్యానించారు. బాధ్యతలు చేతకా కుంటే మంత్రి పదవిపై ఆయన పునరాలోచన చేయాలన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని అందించ కుంటే కాంగ్రెస్ వారికి రైతులతో దెబ్బలు తప్పవన్నారు. రైతుల సమస్యలపై కేసీఆర్ (kcr) త్వరలో కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు.