Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Elections: విద్యా, ఉద్యోగాల కోసమే ఎమ్మెల్సీగా బరిలో

రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతోపాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ తో తాను నల్లగొండ, వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు అశోక అకాడమీ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు.

గత ప్రభుత్వం మోసం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే చేస్తుంది

ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పటిష్టం చేసి ఉద్యోగాలు కల్పించాలి

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్

ప్రజా దీవెన నల్గొండ:  రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతోపాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ తో తాను నల్లగొండ, వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా(MLC Elections) స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు అశోక అకాడమీ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు.

ఆయన బుధవారం నల్లగొండలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా(MLC Election nomiantions) నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే గద్దె దించాం.నేడు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. రెండు లక్షల ఉద్యోగాలను ప్రకటించినా నేటికీ జాబ్ క్యాలెండర్ ను ప్రకటించలేదని అన్నారు.
యుపిసి యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనిచేసి ఉద్యోగాల నియామకాల విషయంలో పటిష్టంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ 2 పోస్టులు 2000 నుంచి 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని అది కూడా ప్రతి జూలై లో జాబ్ క్యాలెండర్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేడు డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసినటువంటి విద్యార్థులు సైతం ఉద్యోగాలు లేక స్విగ్గిలు, జోమాటాల్లో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఊహకే పరిమితం అయ్యాయని, గొప్ప ఐటి హబ్(IT hub) గా ఉన్న హైదరాబాదులో 10 శాతం ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ వాళ్లకు వస్తున్నాయని మిగిలినవన్నీ ఇతర రాష్ట్రాల వారు కొట్టుకొని పోతున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 46 ద్వారా ఎంతోమంది అన్యాయం అయ్యారని వారికి న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తానని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్(Notification) ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేసి ఆ పత్రాలు ఇచ్చి తామే ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికి సరికాదన్నారు. గురుకుల ఉపాధ్యాయుల కు బోధన పనులు కాకుండా బోధనేతర పనులు చెప్పి టార్చర్ కు గురి చేస్తున్నారని అది వెంటనే మానుకోవడంతోపాటు వారికి నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ టీచర్లకు పనిగంటలు తగ్గించి కనీస వేతనం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ విషయంపై యాజమాన్యంపై ఒత్తిడి చేయాలని అన్నారు. డిగ్రీ తర్వాత పేద విద్యార్థులు కాంపిటీటివ్ పరీక్షలకు ఫీజులు కట్టలేక అనేకమంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకునే తాను ఒక్క రూపాయికి గ్రూప్ 2 మెటీరియల్ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయకపోతే త్వరలో 30 లక్షల మంది నిరుద్యోగులతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నామినేషన్ కు ముందు క్లాక్ టవర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

MLC Nomination for education and jobs