Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC vote counting: కొనసాగుతున్న’ ఎమ్మెల్సీ’ లెక్కింపు

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగు తుంది. బుధవారం అర్ధరాత్రి దాటి న తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు తొలి, మలి రౌండ్ ల ఫలితం వెలువరించారు అధికారు లు.

మొదటి ప్రాధాన్యత ఓటు రెండవ రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆదిక్యత
రెండు రౌండ్లు కలిపి మల్లన్నకు 14,672 మెజార్టీ
దీటుగా పోటీనిస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి
మూడో స్థానంలో బిజెపి, నాలుగో స్థానంలో అశోక్ గౌడ్
నేటి సాయంత్రానికి ఫలితం వెలువడే అవకాశం
కౌంటింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మె ల్యే కంచర్లను అడ్డుకున్న పోలీసు లు

ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో: వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ (Graduate MLC By-Election Counting)ప్రశాంతంగా కొనసాగు తుంది. బుధవారం అర్ధరాత్రి దాటి న తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు తొలి, మలి రౌండ్ ల ఫలితం వెలువరించారు అధికారు లు. రెండు రౌండ్ల ఫలితం వెలువడే సరికి ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 మెజార్టీ తో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తానికి వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ తో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బలపర్చిన తీన్మార్ మల్లన్న(Tinmar mallanna), బీఆర్ఎస్ బలప ర్చిన ఏనుగుల రాకేష్ రెడ్డి(Enugula rakesh reddy) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

నల్లగొండ లో బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు ప్రారంభించగా రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఈ కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నది. రాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో అధికారులు తొలి రౌండ్ తర్వాతb రెండో రౌండ్ ఫలితాలను ప్రకటించా రు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీ న్మార్ మల్లన్న(Congress candidate Tinamar Mallanna) కు 34,575 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి కి 27,573, బిజెపి అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి కి12,841, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ కు 11,018 ఓట్లు దక్కాయి. ఇదిలా ఉండగా మొత్తం 96 టేబుల్స్ పై లెక్కింపు ప్రారంభం కాగా పట్టభద్రుల ఎమ్మె ల్సీ నియోజకవర్గంలో మొత్తం 4,63,389 ఓట్లు ఉండగా ఇందులో పోలింగ్ లో 3,36,013 ఓట్లు పోల య్యాయి. మొత్తం ఐదు హాళ్లలో 96 టేబుల్స్ ఏర్పాటు ఏర్పాటు చేసి వీటిని లెక్కిస్తున్నారు. ఒక్కో టేబుల్ కు వెయ్యి చొప్పున ఒక రౌండ్ లో 96 వేల ఓట్లను లెక్కించే లా ఏర్పాట్లు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంద ర్భంలోనే చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలన ట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సైతం ఇదే పద్ధతిలో కొనసాగిస్తారు. కాగా, ఫస్ట్ రౌండ్ లో 96,097 ఓట్లను కౌంటింగ్ కోసం తీసుకోగా, ఇందులో 88,369 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 7,728 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

కాగా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రెండో కౌంటింగ్ హాల్ (Counting hall)లో తిరుగుతుండగా డీఎస్పీ స్థాయి అధికారి ఆయనను అడ్డుకున్నా రు. ఆయన ఫొటో కూడా తీయడం తో డీఎస్పీపై కంచర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరో తెలిసి కూడా ఫొటోలు తీయడం ఏమిటని ప్రశ్నిం చారు. దీంతో అందరూ నిబంధనల ప్రకారం నడవాల్సిందేనని సదరు డీఎస్పీ ఆయనతో చెప్పినట్లు తెలి సింది. అయితే కంచర్ల మూడో కౌంటింగ్ (third counting hall ) హాల్ పోలింగ్ ఏజెంట్ గా ఎన్నికల అధికారుల నుంచి అను మతి పత్రం తీసుకున్నట్లు తెలి సింది. అంతేకాకుండా ఓట్ల లెక్కిం పు జరుగుతున్న టేబుళ్ల వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకుంటు న్నారంటూ ధర్మ సమాజ్ పార్టీ పార్టీ అభ్యర్థి బరిగెల దుర్గా ప్రసాద్ ఆందో ళన వ్యక్తం చేశారు. దీంతో పలువురు అభ్యర్థులతో కలిసి దుర్గా ప్రసాద్ కౌంటింగ్ హాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

MLC vote counting Ongoing