ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె నల్గొండ జిల్లా కలెక్టర్ ముందు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 16 వ రోజు వర్షం వస్తున్నా వర్షంలో గొడుగులతో నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోల్గురి కృష్ణ బొమ్మగానీ రాజు మాట్లాడుతూ గత 16 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్షా ఉద్యోగులం విధులు బంద్ చేసి సమ్మె కొనసాగిస్తూ వివిధ రూపాలలో నిరసన చేసినా మా యొక్క డిమాండ్ లను ప్రభుత్వం స్పందించట్లేదు , తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి, రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజుల , కోశాధికారి పుష్పలత , ముఖ్య సలహాదారు నీలాంబరి, చెపురి పుష్పలత, సావిత్రి, యాదయ్య , సాయిలు, వెంకన్న, నాగయ్య , వెంకటకృష్ణ, గిరిధర్, నాగభూషణం చారి, శ్రీనివాసులు, మోహిజ్ ఖాన్, జానయ్య, భిక్షం, బి సైదులు, చందపాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.