ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది. బతుకమ్మ ఆటలతో వారి యొక్క నిరసన తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 20 రోజులుగా క్రమశిక్షణతో శాంతియుతంగా మా యొక్క నిరసనలను వివిధ రూపాలలో తెలుపుతున్నప్పటికీ మరియు విద్యా వ్యవస్థలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో, మండల విద్యా వనరుల కేంద్రాలలో, భవిత కేంద్రాలలో, కాంప్లెక్స్ స్థాయిలో, జిల్లాస్థాయిలో అనేక రకాల పనులు, బోధన ఆగిపోయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
వీరి యొక్క సమ్మెకు మద్దతుగా MEF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేపాక వెంకన్న మాదిగ ,లంకపల్లి నగేష్ మాదిగ,గట్టు మల్లన్న, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి భిక్షపతి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, జిల్లా అధ్యక్షులు ఎండీ యూసిఫుద్దీన్, ప్రధాన కార్యదర్శి కోట సింహాద్రి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జి.సత్యనారాయణ, జిల్లా బాధ్యులు మాధవరెడ్డి, దస్తగిరి, సుధీర్ కుమార్, ఎండి జాన్ హాజరై మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి , కోశాధికారి పుష్పలత,సాయిల్ , ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షం, బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, పరమేశ్,నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, జానయ్యా, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.