Monsoon cultivation: వానాకాలం సాగుకు ఏర్పాట్లు పూర్తి
వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.
అందుబాటులో కావాల్సిన ఎరువులు, విత్తనాలు
పత్తి విత్తనాలు నకిలీవి అమ్మితే చర్యలు తప్పవు
విలేకరుల సమావేశంలో డీఏవో శ్రవణ్ కుమార్
ప్రజా దీవెన నల్గొండ: వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు(Farmers) ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్(Shravan Kumar) తెలిపారు. ఆయన సోమవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలం(Rainy season) సీజన్లో 11.50 లక్షల ఎకరాల్లో ఆయా పంటల సాగు కానున్నట్లు తెలిపారు. అందులో ఎక్కువగా 5.50లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుండగా 5.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు తెలిపారు.
వరిలో 2.80లక్షలు దొడ్డువి… 2.20 లక్షలు సన్నవి సాగు కానున్నాయన్నారు. ఇందుకు గాను కావాల్సిన విత్తనాలు(Seeds)కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పత్తి విత్తనాలు ఒకటి రెండు వర్షాలతో పెట్టవద్దని పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాకనే విత్తాలని సూచించారు. పత్తి విత్తనాలు నాణ్యమైనవి కొనాలని గుర్తింపు ఉన్న కంపెనీ విత్తనాలు తప్ప గుర్తింపు లేని కంపెనీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. వరి, పత్తి విత్తనాల్లో ఆయా కంపెనీల విత్తనాలు తీసుకోని చెకింగ్(checking)కోసం పంపించామని వాటిల్లో నాణ్యత లేకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు.
అదే విదంగా పచ్చి రొట్ట ఎరువులు సైతం లక్ష ఎకరాల్లో సాగు చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక జిల్లాలో 49వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న డీఏవో(DAO) ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా(Urea) కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విత్తనాల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికి 72888945039 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Monsoon cultivation arrangements completed