Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

mudireddy sudhakar reddy: ప్రత్తి, వరిపంట కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు

–రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండ శ్రీశైలం

mudireddy sudhakar reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రత్తి,వరి పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలువెంటనే కొనుగోలు కేంద్రాలుఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముది రెడ్డి సుధాకర్ రెడ్డి ( mudireddy sudhakar reddy),బండ శ్రీశైలం (Banda Srisailam)అన్నారు. బుధవారం రోజున న జిల్లావ్యాప్తంగా ప్రత్తి, వరి ధాన్యం వ్యవసాయ మార్కెట్లోకి రైతులు తీసుకువస్తున్నారని, వెంటనే సీసీ ఐ కొనుగోలు కేంద్రాలు ప్రారం భిం చాలని జిల్లా కలెక్టర్ కు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తం గా ప్రత్తి మార్కెట్లకు (Copy markets) తీసుకువస్తు న్నారని, ప్రభుత్వం మాత్రం సీ,సీ,ఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం వలన గ్రామాల్లో ఉన్న మ ధ్య దళారీలు, బ్రోకర్స్ వచ్చి పత్తి కింటాలుకు రూ. 5000 రూపాయ లు నుండి6000 రూపాయల వర కు ధరను తగ్గిస్తూ, తూకంలో అద నంగా తూకం వేస్తున్నారని ఆవేద న వ్యక్తం చేశారు.

వ్యవసాయ పెట్టు బడులు పెరిగినందువలన విత్తనాలు, ఎరువు పురుగుమం దులు (Seeds, fertilizers and pesticides)రేట్లు పెరిగినావని, ప్రతి క్వింటాలుకు 12500 రూపా యలు,వరి ధాన్యముకు క్వింటా లుకు2850 రూపాయలు ఇవ్వాలని,అదనంగా 1000 రూపాయలుబోనస్ ప్రకటించాలనివారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనిడిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలలోమౌలిక వసతులు కల్పించాలని, ట్రాన్స్ పోర్ట్,గోనెసంచులు కొరత లేకుండానివారించాలనివారు అన్నారు. వరి, పత్తి కాంటావేసిన వెంటనేరైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలని వారు కోరారు. కొనుగోలు కేంద్రాలపైజిల్లా అధికారులు వెంటనే తనిఖీలు చేసి రైతులను ఆదుకోవాలనివారు కోరారు. ఈ కార్యక్రమంలోరైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శికె. నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు అయిత రాజు నరసింహ, సాగర్ల మల్లేష్, చాపల మారయ్య,కుంభం కృష్ణారెడ్డి, వి. నారాయణరెడ్డితదితరులు పాల్గొన్నారు.