–సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
Mudireddy Sudhakar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లాలో చామ పీడిత, ఫ్లోరైడ్ ప్రాంతాలైన (Prone, fluoridated areas) దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే డి0డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy)అన్నారు . శనివారం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.
డిండి ఎత్తిపోతల పథకానికి (Dindi lift scheme)డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా 15 రోజుల పోరాట కార్యాచరణ ప్రకటించారు.డిండి ఎత్తిపోతల పథకం సాధన కోసం కొనసాగింపుగా తక్షణమే ఈ కింది కార్యక్రమాలు నిర్వహించాలి.ఈ విలేకరు ల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారీ ఐలయ్య ,బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున చిన్నపాక లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు మల్లం మహేష్,దండెంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు