–సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
Mudireddy Sudhakar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పాలస్తీనులపై (On the Palestinians) ఇజ్రాయిల్ చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలని కోరు తూ శనివారం సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పట్టణం లోని సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సంద ర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy)మాట్లాడుతూ గడచిన పది నెలల్లో సామ్రాజ్యవాద అమెరికా దన్నుతో ఇజ్రాయిల్ సాగించిన దారుణ నరమేధంలో 40 వేలకు పైగా పాలస్థానీయులు మృత్యువాత పడ్డారని అందులో 15 వేలమంది చిన్నారులే ఉన్నారు.
90వేల మంది పైగా క్షతగాత్రులు అయ్యారని ఇజ్రాయిల్ బాంబుల దాటికి గాజా ప్రాంతం 60 శాతం నివాస సముదాయాలు నాశనం అయ్యాయని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని ఒకవైపు శాంతి జపం చేస్తూనే ఇజ్రాయిల్ కు ఆయుధం సాయం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై (Joe Biden) స్వదేశంలోనే నిరసనలు వెళ్లి వేతాయనిఅన్నారు. ఇట్లాగే యుద్ధం కొనసాగితే ఆ ప్రభావం ప్రపంచ దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదేవి ధంగా ఈ ప్రమాదకర పరిస్థితి దాపురించ కుండా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పరిశ్ర మించాల్సిన కీలక తరునం, అమెరికా ఇజ్రాయిల్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా మేధావులు అభ్యుదయ సంఘాలు సంస్థలు స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నారి ఐలయ్య బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హశం, ఎండి సలీం, పీ నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, మల్ల మహేష్, కొండ అనురాధ, దండెంపల్లి సరోజ గాదె నర్సింహ, ఎంకన్న, అద్దంకి నరసింహ, సత్యనారాయణ, బొల్లు రవి, జిల్లా అంజయ్య, సైదాచారి, రాములు తదితరులు పాల్గొన్నారు.