Mudireddy Sudhakar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానా లను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. మంగళవారం నాంపల్లి మండలంలోని మేళ్లవాయి గ్రామం లో కొమ్ము లక్ష్మయ్య అధ్యక్షతన పసునూరు మేళ్లవాయి గ్రామ శాఖ మహాసభలు జరిగినవి. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలను అమలు చేయాలని వాటి కోసం ప్రజలతో పెద్ద ఎత్తున ప్రభుత్వం మెడలు వంచైనా వాగ్దా నాల అమలుకు కృషి చేస్తామని అన్నారు.
ప్రభుత్వం ఇటీవల రైతు బంధు farmer) ఇవ్వలేమని చేతులెత్తే య డం తగదని సూచించారు. ఇందిర మ్మ ఇల్లు నియోజకవర్గానికి 5000 ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయా లని అందులోని ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల ఎడల కనీస అవగాహన లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర (central state)ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్య మ పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు సిపిఎం (CPM) జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగా ర్జున మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ధరలు నిరుద్యోగం ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు పెరుగుతున్న ధరలను అరికట్టడంలో విఫలం చెందుతుం దని తెలిపారు రైతా గానికి మార్కె ట్ ద్వారా గిట్టుబాటు ధర కల్పిం చాలని వరి పత్తి తడిసిన ధాన్యాని కి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి గ్రామ శాఖ కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య ముఖేష్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.