Municipal under ground drainage : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పూర్తి
--నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
సత్వరమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పూర్తి
–నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ( under ground drainage) సిసి రోడ్డు పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని నల్లగొండ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం పట్టణంలోనే 19వ వార్డు శ్రీనివాస కాలనీ, ఎన్జీ వోస్ కాల నీ, నందీశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కౌన్సిలర్ గోగుల రాముల మ్మ, గణేష్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ( burri Srinivas Reddy) మాట్లాడుతూ రానున్న 8 నెలల వ్యవధిలో పట్ట ణంలోని అన్ని వార్డులోని ప్రతి వీధి కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి అయి న అనంతరం సిసి రోడ్డు ( cc roads) పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహ కారంతో నల్లగొండ( nalgonda) పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృ ద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కాలనీవాసులంతా సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా గోగుల గణేష్ మాట్లాడుతూ మంత్రి కోమ టిరెడ్డి సహకారంతో 19 వార్డులో ప్రాధాన్యతనిచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం పట్ల మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి( gum mula mohan reddy) కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని ప్రతి కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి అయిన కాలనీలలో ప్రజలు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గోగుల గణేష్ ను సన్మానిం చారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కోమటిరెడ్డి సమీరెడ్డి, యడ వల్లి అంజయ్య, వెంకట్ రెడ్డి,శ్రీనివాస్,సంపత్ నాయుడు, పబ్లిక్ హెల్త్ ఏఈ నాగ ప్రసాద్ , ఇంజనీర్ చక్రవర్తి, మున్సిపల్ జవాన్ శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ నాయుడు, యువకులు శివాజీ, అశ్విన్ నాయుడు,శివ నాయుడు,కాలనీవాసులు పాల్గొన్నారు.
Municipal under ground drainage