Nagam Varshit Reddy: రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్ కృష్ణయ్యకు అభినందనలు తెలియజేసిన నల్గొండ జిల్లా బిజెపి నాయకులు..
ప్రజా దీవెన, నల్గొండ టౌన్: బీసీ ఉద్యమ నేత , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను బిజెపి పార్టీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా హైదరాబాదులో ఒక వివాహ వేడుకలో ఆర్. కృష్ణయ్యను నల్గొండ జిల్లాకు చెందిన బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు..
నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. వెనుకబడిన వర్గాలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుందని ఆ దిశలో భాగంగా ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించడం సంతోషం వ్యక్తం చేస్తూ , భారతీయ జనతా పార్టీ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక, సంస్థలతోపాటు ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,బండారు ప్రసాద్ , పోతేపాక సాంబయ్య, బొజ్జ నాగరాజు, పాలకూరి రవి గౌడ్ ,దాయం భూపాల్ రెడ్డి, కంకణాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..