ప్రజా దీవెన, నల్గొండ టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 117 వ ఎపిసోడ్ ను నల్గొండ బిజెపి నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాల్లో మరియు వారి నివాసాలలో వీక్షించారు. దేశ ప్రజలతో తన మనసులోని మాటలను నేరుగా పంచుకునే మన్‌కీబాత్ కార్యక్రమంలో దేశ ప్రజలందరికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల *బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు*
మన్ కీ బాత్ వీక్షించిన వారిలో *బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ*..
కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన ఎరువులను రైతులకు అందజేయడం మరియు రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వడం బిజెపి ప్రభుత్వానికే సాధ్యమైందని గోలి మధుసుధన్ రెడ్డి తెలిపారు..ఒడిస్సా రైతుల ప్రస్తావన నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తీసుకురావడం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆదర్శంగా నిలుస్తుంది అని తెలిపారు.
ఒడిస్సా రాష్ట్రంలోని కలహండి రైతులు స్వయంకృషితో సాధించిన విజయాలను మోడీ ప్రస్తావించారు అని తెలిపారుప.గతంలో రైతులు వలస వెళ్ళే పరిస్థితులు ఉన్నచోట, నేడు కలహండిలోని గోలముండా బ్లాక్ కూరగాయల కేంద్రంగా మారిందని, కేవలం 10 మంది రైతులతో కూడిన చిన్న సమూహంతో ప్రారంభమై, ఈ బృందం కిసాన్ ప్రొడక్ట్స్ అసోసియేషన్’ అనే పేరుతో రైతు ఉత్పత్తి సంస్థను స్థాపించిందనే విషయం ప్రధాని మోదీ వెల్లడించారు అని మధుసూదన్ రెడ్డి తెలిపారు ఇలా అనేక అంశాలను నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రస్తావించారని గోలీ మధుసూదన్ రెడ్డి అన్నారు..
*మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ నేవర్స్ నీరజ మాట్లాడుతూ*..
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి నెల చివరి ఆదివారం క్రమం తప్పకుండా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని , ప్రజలందరూ అనేక విషయాలు తెలుసుకుంటున్నారని నీరజ తెలిపారు..