Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagam Varshit Reddy: బూత్ స్థాయిలో బిజెపి బలోపేతమే లక్ష్యం

— నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి

Nagam Varshit Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy) అధ్యక్షతన మంగళవారం నల్గొండ జిల్లా కార్యాలయంలో నల్గొండ జిల్లా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల, ఆ పై స్థాయి నాయకులకు, కార్యకర్తలకు (Leaders and activists) పార్టీ పటిష్టత గురించి, సభ్యత్వ నమో దు గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క రు 100 మందిని సభ్యులుగా చేర్చి క్రియాశీల సభ్యులుగా మారాలని స్పష్టం చేశాను.

బిజెపిని బూత్ స్థాయి (BJP booth level)నుండి బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా కష్టపడాలని కోరాను. న ల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్ని కలలో సత్తా చాటడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు సైనికునిలా పని చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి యం.శ్రీనివాస్ గౌడ్,బీజేపీ కిసాన్ మోర్చా జాతీ య నాయకులు గోలి మధుసూ దన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్,కడగంచి రమేష్, తూటుపల్లి రవి , సభ్యత్వ నమో దు జిల్లా ప్రముఖ్ విద్యా సాగర్ రెడ్డి (Vidya Sagar Reddy) తదితరులు పాల్గోన్నారు.