Nagarjuna Govt College: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : విద్యార్థులకు కృత్యాధార బోధనతో స్వీయ జ్ఞానం అలవడుతుందని నాగార్జున ప్రభుత్వ కళాశాల జంతుశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. జ్యోత్స్న అన్నారు. శనివారం కళాశాల జంతుశాస్త్ర విభాగం పి. జి విద్యార్థులు సముద్రయానం, మత్స్యకార వృత్తిపైన కార్యశాల నిర్వహించారు. ప్రాచీన కాలం, బ్రిటిష్ కాలం, ఆధునిక సాంకేతిక యుగాల వారిగా షిప్పింగ్, ఫిషరీస్ నమూనాలు తయారుచేసి ప్రదర్శించారు. ప్రాచీనకాలంలో వాడిన చిన్న పడవలు, పుట్టి, తెరచాపలు, నౌకలు, పెద్ద ఓడలు, స్టీమర్లు, టైటానిక్ ఓడల నమూనాలు తయారు చేశారు.
వీటితోపాటు విద్యార్థులు తయారుచేసిన జలాంతర్గాములు, యుద్ధనౌకలు ఆకట్టుకున్నాయి. మత్స్యకారులు వాడే చేపలను పట్టే వివిధ రకాల వలలను కూడా తయారుచేసి ప్రదర్శించారు. గాలాలు, ఎరలు, వానపాములను వినియోగించి చేపలు ఎలాపడుతారో సందర్శకులకు వివరించారు. పారిశ్రామికంగా వాడే జంబో వలల నమూనాలు కూడా తయారు చేశారు.
ఇవన్నీ లో కాస్ట్-నో కాస్ట్ తో తయారుచేయడం అభినందనీయమని వైస్ ప్రిన్సిపాల్ డా. అంతటి శ్రీనివాస్ జంతుశాస్త్ర విభాగాన్ని అభినందించారు. విద్యార్థుల కార్యశాలను సందర్శించినవారిలో అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవి కుమార్, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, సిఓఇ. బి. నాగరాజు, అధ్యాపకులు డా. ప్రసన్నకుమార్, వేణు, డా. భాగ్యలక్ష్మి, మహేశ్వరీ, సరిత, వెంకట్ విద్యార్థులు సిద్దు, సృజన్, నవ్య, సఫియా ఫిర్దోస్, బుశ్రా, అశ్విని, ప్రణయ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.