Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagarjuna Sagar: సాగర్ లో సండే సందడి

–సెలవు రోజు కావడంతో పెరిగిన సందర్శకుల రద్దీ
–8 గేట్లకు కుదింపబడిన నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత

Nagarjuna Sagar: ప్రజా దీవెన, నల్లగొండ : నాగార్జున సాగ‌ర్‌కు (Nagarjuna Sagar)ఇన్‌ఫ్లో త‌గ్గింది. నిన్న 26 గేట్లు ఎత్త‌గా ఆదివారం కేవ‌లం ఎనిమిది గేట్లు (Eight gates)మాత్ర‌మే ఎత్తి 62,536 క్యూసెక్కుల నీరు మాత్ర‌మే విడిచి పెడుతున్నారు. నిన్న పూర్తిగా గేట్లు ఎత్తారు అని తెలుసుకుని ఆదివా రం అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు వ‌చ్చారు. అయితేఎనిమిది గేట్లు మాత్ర‌మే ఎత్త‌డం వ‌ల్ల నిరాశ‌కు గుర‌య్యారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్ర నుంచి అధిక సంఖ్య ప‌ర్యాట‌కులు చేరుకోవ‌డం తో సాగ‌ర్ (Sagar) ప‌రిస‌రాలు ర‌ద్దీగా మారా యి. ప‌ర్యాట‌కుల సంద‌డితో సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు లు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశిస్తు న్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.

కేవలం ఎనిమిది గేట్లు ఎత్తివేత‌ శ్రీ‌శైలం నుంచి నాగార్జున సాగ‌ర్‌కి (Nagarjuna Sagar from Srisailam) 1,02,746 క్యూసెక్కుల నీరు చేరుతుండ‌డంతో ఎనిమిది గేట్లను ఐదు అడుగుల‌ మేర ఎత్తి 62,536 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. నిన్న నాగార్జున సాగ‌ర్‌కి 3,59,779 క్యూసెక్కుల నీరు చేర‌గా, ఇక్క‌డ గేట్ల‌న్నీ ఎత్తి 3,12,756 క్యూ సెక్కులు కింద‌కు విడిచిపెట్టిన సంగ‌తి విదిత‌మే. ఆదివారం కుడి కాలువ‌ ద్వారా 1058 క్యూసెక్కు లు , ఎడమ కాలువ‌ ద్వారా 8367 క్యూసెక్కులు, పవర్ హౌస్ కి 28, 785 క్యూసెక్కులు, ఏఎంఆర్పి ద్వారా 1800 క్యూసెక్కులు , ఎల్ఎ ల్సీ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టులోకి 1,02,746 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో ప్రాజె క్టు నుండి నీటిని అధికారులు వది లిపెడుతున్నారు. నాగార్జునసాగర్ నిండుకుండ‌లా క‌నిపిస్తోంది.

సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడు గులకు గాను ప్రస్తుతం 587.30 అడుగుల చేరుకుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను 305.6 టీఎం సీలు ఉందని అధికారులు వెల్ల డించారు.వ‌చ్చే వారం ఎలా ఉం టుందో శ్రీ‌శైలం నుంచి నాగార్జున సాగ‌ర్‌కు (Nagarjuna Sagar) ప్ర‌స్తుతం భారీగా వ‌ర‌ద రావ‌డంతో అన్ని గేట్లు ఎత్తారు. ఒక‌వేళ‌ ఇన్‌ఫ్లో త‌గ్గిపోతే ఎత్తిన గేట్ల సంఖ్య త‌గ్గించే అవ‌కాశం ఉంటుం ది. ఇదే ఇన్‌ఫ్లో కొన‌సాగుతోంద‌న్న ప‌రిస్థితి లేదు. వచ్చేవారం ఎలా ఉంటుందో అని ఈ వారం అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు సాగ‌ర్ సుం ద‌ర దృశ్యాల‌ను తిల‌కిం చేందుకు వ‌స్తున్నారు.పోలీసుల ఆంక్ష‌లు నాగార్జునసాగర్‌లో పోలీసులు ఆం క్షలు విధించారు. ఆదివారం కావ డంతో సాగర్‌ అందాలను చూడటా నికి పర్యాటకులు పోటెత్తారు. దీంతో ప్రధాన డ్యామ్‌, పవర్‌ హౌస్‌ (Main Dam, Power House)పరిసరాల్లో వెళ్లకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు.