Nomination : 4వ రోజు.. పది మంది నామినేషన్లు
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం 13-నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు, 10 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రజా దీవెన నల్గొండ: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం 13-నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు, 10 సెట్ల నామినేషన్లు (Nominations) దాఖలు చేశారు.వీరిలో 6 గురు పార్టీ అభ్యర్డులు ఆధార్ పార్టీ, బిజెపి, ఎం సి పి ఐ (యు), తెలంగాణ సకలజనుల పార్టీ, రిపబ్లికన్ సేన పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాగా బిజెపి, ఎమ్ సి పి ఐ (యు), ధర్మ సమాజ్ పార్టీ (డీస్పీ ) అభ్యర్థులు రెండవ సారి నామినేషన్ దాఖలు చేశారు.
వివరాలు….
–అలియాన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ
తరఫున సోమవారం (1) సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఏడ నాగ్ పుల్లారావు,
–బీజేపీ పార్టీ అభ్యర్థి గా నల్గొండ పార్లమెంట్ (Parliament) స్థానానికి మరో సెట్ నామినేషన్ దాఖలు చేసిన శానంపూడి సైదిరెడ్డి. ఈనెల 18న ఒక సెట్, సోమవారం తిరిగి ఇంకో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
–ఎం సి పి ఐ (యు) పార్టీ తరఫున నల్గొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వసుకుల మట్టయ్య. ఈనెల 19న ఒక సెట్, సోమవారం మరో సెట్ దాఖలు చేశారు.
–తెలంగాణ సకలజనుల పార్టీ తరఫున నల్గొండ పార్లమెంటు స్థానానికి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన నందిపాటి జానయ్య.
–ధర్మ సమాజ్ పార్టీ తరఫున నల్గొండ (Nalgonda)పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన తలారి రాంబాబు.ఈనెల 19న ఒక సెట్, సోమవారం మరో సెట్ దాఖలు చేశారు.
–నల్గొండ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి గా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన మర్రి నెహెమియా.
–నల్గొండ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన పానుగోతు లాల్ సింగ్ నాయక్.
–నల్గొండ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా (Independent candidate) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన చీదల్ల వెంకట సాంబశివరావు.
–నల్గొండ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన లింగం కృష్ణ.
–రిపబ్లికన్ సేన పార్టీ తరఫున నల్గొండ పార్లమెంటు స్థానానికి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వంగపల్లి కిరణ్.వీరంతా నల్గొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్రకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Nalgonda candiates parliamentary nominations