హత్యకేసులో యావజ్జీవ శిక్ష
17మందికి ఒకేసారి జీవితఖైతు విదిస్తూ తీర్పు
నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ జిల్లా రెండో అదనపు జడ్జి రోజా రమణి జడ్జిమెంట్
అడ్డగూడూరు పీఎస్ పరిధిలోని హత్య కేసు దోషులకు సంచలన
బంధువులు ఆర్తనాదాలతో దద్దరిల్లిన కోర్టు ప్రాంగణం
Nalgonda Court: ప్రజాదీవెన, నల్లగొండ: హత్య కేసులోని నిందితులకు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జీవిత ఖైదు విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగుతుర్తి నియోజవకర్గ పరిధిలోని అడ్డగూడూరు మండలంలో జరిగిన హత్యకేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ, జిల్లా రెండో అదనపు జడ్జి రోజా రమణి ఈ మేరకు మంగళవారం తీర్పు వెళ్లడించారు. 17మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ రూ.6వేల జరిమానా విధించారు. ఓ వ్యక్తి మరణానికి కారణమైన సంఘటన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీంపేట గ్రామంలో 2017లో చోటుచేసుకుంది.
అదే గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణానికి బట్ట లింగయ్య కారణమయ్యాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు పపించగా, బెయిల్ పై లింగయ్య బయటకు వచ్చాడు. ఈ క్రమంలో దసరారోజు తన కుటుంబంతో జమ్మికి వెళుతున్న క్రమంలో, గతంతో ఇతడి వల్ల చనిపోయిన కుటుంబీకులు ఎదరుపడ్డారు. క్షణికావేశంతో ఉద్రేకానికిలోనై భౌతిక దాడికి పాల్పడి బట్ట లింగయ్యను హత్య చేశారు. అడ్డగూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు. అప్పటి ఏసీపీ ఎస్.రమేష్ ఈ కేసును విచాణ చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదనలు వినిపించారు. సాక్ష్యాదారాల పరిశీలన అనంతరం నల్లగొండ ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు ఈ కేసులో 17మంది నిందితులకు ఒక్కొక్కరికీ జీవిత ఖైదు, రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో దోషులు నిర్ధారించబడిన వారు పండుగ రామస్వామి, పండుగ సాయిలు, రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, వీరమల్లు, ఓ భిక్షం, పండుగ నర్సాయిష్, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పనగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పిలబోయిన లింగయ్య, తదితరులకు జీవితఖైదు పడగా, జక్కుల భిక్షమయ్య (45) కేసు విచారణలో ఉండగా మరణించారు. జడ్జిమెంట్ అనంతరం దోషులు, వారికోసం వచ్చిన కుటుంబసభ్యుల రోదనలతో కోర్టు ఆవరణలో దద్దరిల్లిపోయింది. కాగా, రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ చట్టవ్యతిరేక చర్యలు పాల్పడ్డవారు, శిక్ష అనుభవించాల్సిదేనని అన్నారు.