Parliament elections: భువనగిరిలో బూర గెలుపు ఖాయం
కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్టుగా ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనిబీజేపీఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ పేర్కొన్నారు.
బీజేపీఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్
ప్రజా దీవెన, కట్టంగూర్: కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్టుగా ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనిబీజేపీఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వనికి 400 సీట్లు రావడం భువనగిరి లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గెలుపు ఖాయం అయిపొయిందని అయన స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాబార్ది సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 11వరోజు శుక్రవారం ఉదయం అయిటి పాముల గ్రామంలో నిర్వహించిన కేంద్రం ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులను కలిసే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా కేంద్రం ద్వారా లబ్ది పొందిన పలువురు రైతులను మహిళలను నిరుపేద ప్రజలను కలుసుకుని మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేరోజుకు కూడా చాలా మంది నిరుపేదలు మరుగుదొడ్లు నిర్మించుకోలేక పోయిన వారికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు దేశ వ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే కాకుండా అప్పటివరకు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వారికి ఉజ్వల యోజన ద్వారా 11 పదకొండు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ అని అన్నారు. ఇంకా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ ప్రజల క్షేమం కోసం పని చేస్తున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేయడం కోసం ప్రజలు సిద్దమై ఉన్నారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో గోలి మహే శ్వరి విజయకుమార్ నీలం శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.