ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐకాన్ ఆసుపత్రి సౌజన్యంతో నవం బర్ నెలలో నెల రోజులపాటు జర్న లిస్టులకు, వారి కుటుంబ సభ్యుల కు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి నందుకు గాను నల్లగొండ ప్రెస్ క్లబ్ నాయకత్వం, కృతజ్ఞతలు ధన్య వాదములు తెలియజేసింది. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ పక్షాన ప్రెస్ క్లబ్ బాధ్యులు యాజ మాన్యం కలిసి స్వయంగా కృత జ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఐకాన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో భవిష్యత్తులో నల్ల గొండ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అందజేయబోయే వైద్యపరమైన సేవలకు సంబంధించి యాజ మాన్యంతో బాధ్యులు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్ల గొండ ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదా రులు గుండగోని జయశంకర్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదె రమేష్, కోశాధికారి దండంప ల్లి రవికుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్య క్షుడు సల్వాది జానయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.