Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Red Cross: ఖమ్మం వరద బాధితులకు బాస టగా నల్గొండ రెడ్ క్రాస్

Nalgonda Red Cross: ప్రజా దీవెన, నల్లగొండ: ఖమ్మం వరద బాధితుల కోసం నల్లగొండ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ బాసటగా నిలి చింది. రాష్ట్ర రెడ్ కార్(Nalgonda Red Cross) సంస్థ సహ కారంతో జిల్లా కలెక్టర్ సూచన మే రకు గత వారం రోజుల క్రితం నిరం తరాయంగా కురిసిన భారీ వర్షాల కు ఖమ్మం జిల్లా రూరల్ ఏరియా లోని కాసనతండ వలయతండా గ్రామాలలో నివాసగృహాలు నీట మునిగి సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని ఉద్దేశంతో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు రూ. 4 లక్షల విలువ గల 300 కుటుంబాలకు సరిపడ నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, బట్టలు బెడ్ షీట్స్ (Necessary goods, cooking utensils, clothes, bed sheets) టార్పాలిన్ పట్టాలు తదితర వస్తువులను అందజేయనున్నారు.

జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక సహకారంతో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ వాహనాన్ని జెండా ఊపి ప్రారం భించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యా ప్తంగా వివిధ దేశాల్లో రెడ్ క్రాస్ సంస్థ (Red Cross organization) సేవలు ప్రశంసనీయమని అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేం దర్ రెడ్డి ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా వరద బాధితులకు ఆదుకోవాలని ఉద్దేశంతో వారికి కావాల్సిన నిత్య వసర సరుకులు అందజేయాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచనని ప్రతి మనిషిలో సేవా తత్పర్తను అవలంబించుకోవాలని ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం కనీసం మానవ ధర్మం అని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారు చేస్తున్న ఈ సహకారం మరవలేదని జిల్లాలో యూత్ సేవా కార్యక్రమాలు విస్తృ తం చేయాలని ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు ఉం టాయని పలు సూచన సలహాలు చేస్తూ మేనేజింగ్ కమిటీ సభ్యుల ను అభినందించారు.

ఈ కార్యక్ర మంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి (Red Cross Chairman Goli Amarender Reddy), స్టేట్ మెంబర్ మందడి నర్సిరెడ్డి వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మేనేజింగ్ కమిటీ మెంబర్స్, ఖమ్మంపాటి కోటే శ్వరావు ఎస్ సరస్వతి బుక్కీశ్వ రయ్య జల్లా దశరథ ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి సభ్యులు ఆమంచి రాజలింగం మిరియాల యాదగిరి యూత్ వాలంటీర్స్ పిసికే లక్ష్మీ ఈశ్వర్ భువనగిరి శివ పూర శివ సాయి శ్రావణ్ సందీప్ సాయి నవదీప్ రజనీకాంత్ పెరికి సంపత్ కుమార్ నేటి విప్లవ కుమార్ అంజయ్య కోట్ల జయపాల్ రెడ్డి సిబ్బంది సద్దాం హుస్సేన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.