— పాత మిద్దెలు, తడిసిన ఇండ్ల ప్రజలు సురక్షిత ప్రాంతంలో ఉండాలి
–వర్షపు నీరు ప్రవహిస్తున్న చోట రవాణా పునరుద్ధరణ
–విద్యుత్ త్రాగునీరు కి ఇబ్బందు లు కలవకుండా చర్యలు
–వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
–అధికారులకు ఆదేశాలు కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తడిసిన పాత ఇండ్లు, మట్టి మిద్దెలు పడిపోయి ప్రాణహాని జరిగేందుకు అవకాశం ఉందని, అలాంటి ఇండ్ల నుండి ప్రజలను తక్షణమే కాళీ చేయించి సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy)అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై ఆదివారం ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ (teleconference)నిర్వహించారు. వర్షాల వల్ల రహదారులపై నీరు ప్రవహిస్తున్న చోట రవాణా పునరుద్ధరణ చేయాలని, అలాగే విద్యుత్, తాగునీటి కి ఇబ్బందులు ఏర్పడినచోట తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచినట్టైతే వెంటనే నీటిని బయటకు పంపించాలని ఆదేదించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంజరగకూడదన్నారు.
ప్రజల అత్య వసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం కేతేపల్లి మండలంలో 16.8 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోద యిందని, కొన్ని మండలాలలో 150,140 మిల్లీమీటర్లు వర్షంనమోద యిందని, జిల్లావ్యాప్తంగా సరాసరిన10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై నట్లు కలెక్టర్ తెలిపారు. ఆదివారం, అలాగే సోమవారం ఇంకా భారీ, అతి భారీ వర్షాలు (teleconference)ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారుశానిటేషన్ విషయంలో రాజీ పడవద్దని, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ (Short circuit)కు అవకాశం ఉన్నచోట విద్యుత్ అధికారులు వెంటనే సరిచేయాలన్నారు. చెరువులు, కుంటలు తెగిపోయేందుకు, బుంగ లు పడేందుకు ఆస్కారం ఉన్నచోట లస్కర్ల ద్వారా
ముందే గుర్తించి పటిష్టం చేయాలని, ఒక వేళ ఎక్కడైనా తెగిపోతే కిందిగ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్నిగ్రామాలకు తాగునీరు, రవాణ, విద్యుత్ సరఫరా (Drinking water, transport, electricity supply) సక్రమంగా జరిగేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ (Sarat Chandra Pawar)మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జిల్లా లోని రహదారుల పై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని, అంతేకాక సహాయక, పునరావాస చరీస్లలో పోలీసు యంత్రాంగం సహకారం ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్లు టి.పూర్ణ చంద్ర, జె.శ్రీనివాస్,పి ఆర్ ఆర్ అండ్ బి, ట్రాన్స్కో ఎస్ ఈ లు,వ్యవసాయ, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లు మాట్లాడారు.