— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని జిల్లా కలెక్టర్ సి.నారాయ ణరెడ్డి (Narayana Reddy)ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వల్లభరావు చెరువు ను సందర్శించారు.ప్రతి సంవత్స రం లాగే ఈ సంవత్సరం సైతం వినాయక విగ్రహాలను వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయనుం డగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ (SP Sarath Chandra Pawar)తో కలిసి నిమజ్జనానికి తీసుకో వాల్సిన ఏర్పాట్లపై పరిశీలించారు. ఈ నెల 16న గణేష్ నిమజ్జనం నిర్వహిస్తుండగా ఇందుకు అవ సరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించా రు. వల్లభరావు చెరువుతోపాటు ,14వ మైలురాయి, నాగార్జునసా గర్ బ్రిడ్జి కింద, ఇతర ప్రాంతాలలో జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమ జ్జనం జరిగే అన్ని ప్రదేశాలలో భారీ కేడింగ్, క్రేన్లు (Cadding, cranes)ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ఎస్ ఈ ని కలెక్టర్ ఆదేశించారు.కాగా వల్లభరావు చెరువుకు 9 ఫీట్ల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు నిమర్జనానికి వస్తాయని,16 న మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో నిమజ్జనం జరుగుతుం దని, ఈ సందర్భంగా ట్రాఫిక్ మ ళ్లింపు తో పాటు, బందోబస్తు, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నల్గొండ మున్సిపల్ లో చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ ,ఎస్పీలతో విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ తాగునీటి చెరు వులలో (Drinking water pond) వినాయక విగ్రహాలు భోజ నం చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసు కోవాలని సూచించారు. అదేవిధం గా వినాయక నిమజ్జనం రోజు పోలీ సు బందోబస్తులో ఉన్న సిబ్బందికి రేడియం స్టిక్కర్స్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అలాగే సీసీ కెమె రాలు సైతం ఏర్పాటు చేయాలని, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు వల్లభరావు చెరువు లో విగ్రహాలు నిమజ్జనం చేసేం దుకు అవసరమైన నీటిని ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా డి-37,39 కాలువ లతో పాటు అన్ని డిస్ట్రిబ్యూటర్ ఇలా కింద ఆయకట్టు చివరి భూ ములకు సాగునీరు వెళ్లే విధంగా చూడాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ,ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, డి.ఎస్.పి శివరాం రెడ్డి, జిల్లా అగ్నిమాపక, మత్స్య, ట్రాన్స్కో తదితర అధికారులు ఉన్నారు.