–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది ద్దాలని,ఇందుకు గ్రామస్తుల సహ కారం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy)అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో వనమహోత్సవం కింద మొక్కలు నాటిన అనంతరం పాఠశా లలో చేపట్టిన పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. బ్రాహ్మణ వెళ్లెముల పాఠశాలలో అన్ని సౌక ర్యాలు బాగున్నాయని, కార్పొరేట్ పాఠశాల (school) మాదిరి గా సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. డైనింగ్ హాల్, కిచెన్, వాటర్ ట్యాప్స్ పాఠశాలలో చేపట్టిన ఆటస్థలం, బాత్రూం అన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల వంటగ దిని మోడరన్ కిచెన్ లాగా తీర్చి దిద్దాలని, ప్లాట్ ఫారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, కట్టెలతో కాకుండా సిలిండర్ పై వంట చేసేం దుకు తక్షణమే రెండు సిలిండర్లు, రెండు స్టవ్ లను పాఠశాలకు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆరవ తరగతి, పదవ తరగతి గదులలోకి వెళ్లి (Into the sixth and tenth class rooms)విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలలో మార్పు తీసుకు వచ్చేందుకు చదువు ఒక్కటే ఆయుధమని, అందువల్ల చదువుకునే వయసులో సమయం వృధా చేయకుండా కష్టపడి చదవాలని ఆయన విద్యార్థులకు బోధించారు. ఎట్టి పరిస్థితుల్లో చదువును నిర్లక్ష్యం చేయవద్దని మన జీవితం మన చేతిలోనే ఉందని అందువల్ల కష్టపడి చదవాలని సూచించారు. ఈ సంవత్సరం పదో తరగతిలో పదికి పది జిపిఎ సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని అన్నారుబ్రాహ్మణ వెళ్లెముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రై వేట్ పాఠశాలలకు దీటుగా తీర్చి ద్దేందుకు అవసరమైన అన్ని సౌక ర్యాలను కల్పిస్తామని, పాఠశాలలో ఉపాధ్యాయుల (Teachers in school) పోస్టులతో పాటు, ఇతర సౌకర్యాలన్ని ఏర్పాటు చేస్తా మని అన్నారు.
గ్రామస్థులతో కలె క్టర్ మాట్లాడుతూ బ్రహ్మణ వెల్లే ముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లను ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిద్దేందుకు ముందుకు రావాలని, ఆగస్టు15 నాటికి గ్రామంలో ప్రయివేటు పాఠశాలలకు పిల్లలను పంపకుండా చూడాలని, ప్రయివేటు పాఠశాల బస్సులు గ్రామానికి రాకుండా పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలకు పంపించేలా గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకొని చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరగా,ఇందుకు గ్రామస్థులు ఒప్పుకోవడమే కాకుండా వచ్చే ఆదివారమే గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ (District Collector)పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అంతేకాక బృహత్ వల్లె ప్రకృతి వనాన్ని సందర్శిం చారు. బృహత్ పల్లే ప్రకృతి వనం చిట్టడవిలా పెరగడంతో ఆయన అభినందించారు. మనస్ఫూర్తిగా పని చేసిన చోట పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు బాగున్నాయని, బ్రాహ్మణ వెల్లేముల మాదిరిగానే ఇతర చోట్ల కూడా పెద్ద ఎత్తున పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను పెంచాలని డి ఆర్ డి ఓ నాగిరెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, డిప్యూటీ ఇంజనీర్ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Executive Engineer Bhumanna, Deputy Engineer Mahesh, School Principals) తదితరులు పాల్గొన్నారు.