Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day celebrations) ఏర్పాట్లను పక డ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదే శించారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ తో కలిసి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వ హించను న్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day celebrations)ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రో డ్లు ,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ ల (State Roads, Buildings, Cinematography Department)మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)ముఖ్య అతిథిగా హాజరుకాను న్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేయ నున్నారని, ఇందుకుగాను స్టేజి, అలంకరణ, వేడుకలకు హాజరయ్యే ప్రము ఖుల కు, ప్రజలు, మీడియా తదితరు లందరికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రోటో కాల్ ప్రకారం సీట్లు ఏర్పాటు తో పాటు,టెంట్లు, తాగునీరు ఏర్పా ట్లలో ఎలాంటి లోపం లేకుండా చూ సుకోవాలని ఆదేశించారు.
వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉండే లా రైన్ ప్రూఫ్ టెంట్లు వేయాలని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day celebrations) కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఉదయం 9 గంటలకు ముఖ్య అతి థి జాతీయ పతా కావిష్కరణ చేస్తా రని, పోలీసు గౌరవ వందనం స్వీ కరణ, జిల్లా ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాధించిన ప్రగతిపై ముఖ్య అతిథి ప్రసంగం, శకటాల ప్రదర్శన, పాఠశాల వి ద్యార్థులచే సాంస్కృతి క కార్య క్రమాలు ,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు గంటలకుసా పత్రాల పంపిణీ, ఆయా పథకాల కింద లబ్ధి దారుల కు ఆస్తుల పంపిణీ ,స్టాల్స్ సందర్శ న ఉంటాయని, ఈ కార్య క్రమాలన్నీ నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తి చేసే విధంగా సంబం ధిత అధికా రులు చర్యలు తీసు కోవాలని చెప్పారు .సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే విద్యార్థులకు గ్రౌండ్లో అవ సరమైన ఏర్పాట్లు చేయాలని, స్టేజిని పూలతో అలం కరించాలని అన్నారు.
వేడుకలకు హాజరయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (MPs, MLAs, MLCs )ఇతర ప్రజాప్రతినిధు లు,అధికారులు,మీడియా ప్రతి నిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడా ల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్లో తాగునీటి తో పాటు పరి శుభ్రత చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదే శించారు. వాహ నాల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని , కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పూర్త య్యె వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదే శించారు. అదనపు కలెక్టర్ జె .శ్రీని వాస్ , గృహ నిర్మాణ పి డి రాజ్ కుమార్, ఆర్ డి ఓ రవి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిపిఆర్ఓ వెంక టేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనే జర్ నాగేశ్వరరావు, పొరసరఫ రాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సి పల్ ప్రతినిధులకు సయ్యద్ ము సా బ్ అహ్మద్ ,డి ఎస్ పి శివశంకర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, తదిత రులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.