–కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చేనేత పవర్ లూమ్ కార్మికుల (Power loom workers) వృత్తిరక్షణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ (Ganji Muralidhar) కోరారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన వృత్తి అయిన వస్త్రోత్పత్తిదారులు సుదీర్ఘకాలంగా చేనేత పరిశ్రమ సంక్షేమంతో పోరాడుతూ అనేక అవస్థలు పడుతున్నదని అన్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధులు లేక ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర త్రిఫ్ట్ ఫండ్ నేతన్న భీమా, లాంటి పథకాలు అమలుకు నోచుకోక తయారు చేసిన వస్త్రాలు మార్కెట్ లేక కోట్లాది రూపాయల వస్త్రాలు నిలువలు గుట్టలుగా పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో 2వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో కేటాయించి చేనేత పవర్ లూమ్ కార్మికులను ఆదుకోవాలని వస్త్రాల నిలువలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,పేదలకు జనతా వస్త్రాల పంపిణీ చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని కిరారు.కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాలు రాష్ట్రంలో అమ్ము డుపోక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికుల కష్టాలు తీర్చేం దుకు ప్రభుత్వమే నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించి ఆకలి చావులు ఆత్మహత్యలను నివారించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
యారన్ సబ్సిడీ నిధులను ( (Yarn subsidy funds) వెంటనే విడుదల చేసి ( చేనేత మిత్ర) కార్మికుల ఖాతాలలో వేయాలని త్రిఫ్ట్ ఫండ్ (పొదుపు పథకం) నిధులు 11 నెలలుగా పెండింగ్లో ఉన్నవి అవి వెంటనే విడుదల చేసి పెండింగు నిధులు అకౌంట్లో జమ చేస్తూ పథకాన్ని కొనసాగించాలని కోరారు.నేతన్న బీమా పథకాన్ని వయసుతో నిమిత్తం లేకుండా చేనేత, పవర్ లూమ్ కార్మికుల అందరికీ బీమా వర్తింపచేయాలని, రాష్ట్రంలో ఉన్న చేనేత పవర్ లూమ్ కార్మికులందరికీ పని కల్పించి కూలి గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చేనేత సహకార సంఘాలకు, చేనేత , పవర్ లూమ్ కార్మికుల (Handloom and power loom workers) కు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలన్నీ మాఫీ చేయాలని వారు కోరారు. బతుకమ్మ చీరల (Bathukamma sarees)తరహా లో జనతా వస్త్రాల కాటన్ చీర ధోతి పేదలకు పంపిణీ చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టే ఇందిరమ్మ ఇండ్ల లో భాగంగా చేనేత పవర్ లూమ్ కార్మికులకు వర్క్ షెడ్డు ఇల్లు కలిసే విధంగా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చేనేత పవర్లూమ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా నెలకు 6000 రూపాయల పెన్షన్, అంతో దయ కార్డులు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు సైదులు, గడ్డం దశరథ, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఏల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.