Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని సిద్ధం చేయాలి

Narayana Reddy: ప్రజా దీవెన, కట్టాంగూర్: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై కట్టంగూరు మండలం వామనగుండ్ల శివారులో ట్రామా కేర్ సెంటర్ (Trauma Care Center)ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) కట్టంగూర్ తహసిల్దార్ ప్రసాద్ ను ఆదేశించారు.మంగళవారం ఆయన హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూరు మండలం వామన గుండ్ల గ్రామ సరిహద్దుల్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కై స్థలాన్ని పరిశీలించారు.

3 రోజుల్లో గుర్తించిన స్థలంలో ప్రభుత్వ స్థలం, ఖాళీ స్థలాన్ని (Government space, free space) స్పష్టంగా విభజించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాక గుర్తించిన స్థలంలో చెట్లను తొలగించాలని, చెత్త,చెదారాన్ని తీసివేసి చదును చేయించాలని తహసిల్దార్ ను ఆదేశించారు. పామన గుండ్ల పంచాయతీ కార్యదర్శి జయసుధ తో గ్రామంలో ఫీవర్ సర్వే వివరాలను, శానిటేషన్, ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియలపై అడిగి తెలుసుకున్నారు.