Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ఆకస్మిక తనిఖీలతో అంతా అలర్ట్

–ప్రభుత్వ కార్యాలయాల్లో గుబులు పుట్టిస్తున్న కలెక్టర్ నారాయణ రెడ్డి తనిఖీలు
–జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అకస్మాత్తు పర్యటనలు
–నార్కెట్ పల్లి పిహెచ్ సీ,ఎస్ బి హె చ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Narayana Reddy:ప్రజా దీవెన, నార్కట్ పల్లి: జిల్లా వ్యాప్తంగా అన్ని పి హెచ్ సీ సిబ్బం ది హాజరు రిజిస్టర్, మందుల తనికి డెలివరీ రూమ్, వాక్సినేషన్ గది, ల్యాబ్, పురుషులు, మహిళల వార్డుల (Delivery room, vaccination room, lab, male and female wards) నిర్వహణలో ఇలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (Narayana Reddy)ఆదేశిం చారు. మంగళవారం నార్కట్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ (checking)చేసిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని పడకల ను పూర్తిస్థాయిలో వినియోగిం చుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ఆదిత్యకు సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని పడకలకు క్రమసంఖ్యను ఇవ్వాలని ఉత్తర్వులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవా లని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఎంతమంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని ఆరా తీశారు.

టీ- డయాగనిస్టిక్ కు (T- Diagnostic) ప్రతి రోజు ఎన్ని కేసులను పంపిస్తున్నారని అసి స్టెంట్ తో మాట్లాడిన కలెక్టర్ ప్రతి రోజు 70 నుండి 70 మంది ఔట్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారని తెలిపిన డాక్టర్ పక్కనే ఉన్న యు నాని ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఔట్ పేషెంట్ల వివరా లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ ఫోన్ నెంబర్, చిరునామా నమోదు చేయాలని ఆదేశించారు. ఎలాంటి రోగులు యునాని ఆసుపత్రికి వస్తు న్నారని ఆరా మందులు ఉచితంగా నే ఇస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ నార్కెట్ పల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష రూపాయ ల లోపు రుణమాఫీపై రైతులతో ముఖాముఖి మాట్లాడిన జిల్లా కలె క్టర్ నార్కెట్పల్లి కి చెందిన రైతు యా దిరెడ్డితో ముఖాముఖి ఎంత రుణం మాఫీ అయ్యిందని ప్రశ్నించిన కలెక్ట ర్ 24 వేల రుణమాఫీ (loan waier) జమైందని యా దిరెడ్డి వెల్లడి ప్రస్తుతం లక్ష రూపాయల లోపు రుణాలు మా త్రం మాఫీ జమ అయ్యాయని తెలిపారు.

మరో 15 రోజుల్లో లక్షన్నర రూపాయలు రుణాలు మాఫీ అయితాయని రైతులకు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ 2018 డిసెంబర్ నుండి మాత్రమే రుణ మాఫీ వస్తుందని అంతకు పూర్వం రుణాలు మాఫీ (loan waier) కావని స్పష్టం చేశారు. బ్యాంక్ మేనేజర్ తో రుణమాఫీ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ నార్కెట్ పల్లి ఎస్బిఐ ద్వారా ఎంత మందికి రుణ మాఫీ అయిందని ఆరా తీశారు. 484 అకౌంట్లలు రుణ మాఫీ జమ అయినట్లు బ్యాంక్ మేనేజర్ కమల్ కాంత్ వెల్లడి నార్కెట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆక స్మిఖ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వనమహోత్సవం కింద మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ పాఠశాలలోని పనులన్నింటిని 15 రోజుల్లో పూర్తి చేయాలని, పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్ తక్షణ మే మరమత్తు చేయించాలి పనుల కు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తున్నట్టు ప్రకటించా రు. పాఠశాలకు రెండు కంప్యూటర్ల మంజూరు చేశారు. పాఠశాలలో మరో మూడు టాయిలెట్లు ఉపాధి హామీ కింద చేపట్టాలని ఎంపీడీ వోకు ఆదేశించారు. ఆరవ, పదవ తరగతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లా డిన జిల్లా కలెక్టర్ టీచర్లు సెలవు పెట్టకుండా గైర్హాజరు కావద్దని, విద్యార్థులకు (students)గుణాత్మక విద్య నాధించాలని కోరారు.