Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: డబ్ల్యూపీసీ(వరల్డు పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్) (World Powerlifting Congress) ఆద్వర్యంలో హైదరా బాద్‌లో నల్లకుంటలో జరిగిన అంతర్‌రాష్ట్ర తెలంగాణ జిల్లాల వెయిట్ లిప్టింగ్‌లో మొదటి చాంఫియన్ షిప్‌ను నల్లగొండకు చెందిన కందుల తేజస్వినిగౌడ్ నీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Narayana Reddy), అదనపు కలెక్టర్ శ్రీనివాసులు (Srinivas)అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీమ్ 3 కేటగిరి అండర్–19 వెయి ట్ లిప్టింగ్ 120 కేజిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిన తేజస్విని ఇంకా జాతీ య స్థాయిలో రాణించాలని ఆకాం క్షించారు. ఈ కార్య క్రమంలో కలె క్టరేట్ ఏవో మోతిలాల్, కోచ్ రఘు, వెంకటరమణా గౌడ్, అభి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.