–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayan Reddy)ఇంజనీ రింగ్ అధికారులను(engineering officers) ఆదేశించారు. మంగళ వారం ఆయన ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కళాశాల (college) మొత్తం కలియ తిరుగుతూ కళాశాల ప్లాన్ ను పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా లో టుపాట్లు ఉంటే ముందే సరి చేసుకోవాలని, కమ్యూనిటీ మెడి సిన్ సెంటర్ అవసరమైన హాల్ (hall) ఏర్పాటు చేయాలని సూచించా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ కొత్త భవనం (new building)నిర్మాణం ఆలస్యానికి గల కారణాల ను ఇంజనీరింగ్ అధికారులను అడి గి తెలుసుకోగా, ఇసుక వల్ల ఆలస్య మైందని తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందించి భవన నిర్మాణాని కి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా భవన నిర్మా ణాన్ని పూర్తిచేయాలని, ప్రత్యేకించి ఈనెలాఖరు నాటికిపూర్తి చేయా ల్సిందిగా ఆదేశించారు.
ఇందుకు టి జి ఎం ఐ డి సి అధికారులతో పాటు కాంట్రాక్టర్ (contr actor) మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి భవనాన్ని పూర్తి చేసి ఇస్తా మని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూప రింటెండెంట్ నిత్యానంద్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజకు మారి, ఆయా విభాగాల అధిప తులు, తదితరులు ఉన్నారు.