Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో ఈ వానాకాలం ధాన్యం సేకరణ పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ బాగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) ఆదే శించారు. సోమవారం ఆయన వానకాలం ధాన్యం సేకరణకు సంబంధించి సమాచారం, ఫిర్యా దుల స్వీకరణకు ఉద్దేశిం చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (District Collector’s Office) ఉన్న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యా లయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ప్రారం భించారు. ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు లో ఏవైనా సమస్యలు తలెత్తిన రైతులు లేదా ఇతరులు ఈ కంట్రోల్ రూమ్ (Control room) లో ఏర్పాటు చేసిన, 24 గంటలు పని చేసే ఫోన్ నెంబర్ 9963407064 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కంట్రోల్ రూమ్ (Control room)ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు పని చేసే విధంగా రెండు విడతలలో విధులు నిర్వహించేలా సిబ్బందిని నియ మించడం జరిగిందని, ఈ కంట్రోల్ రూమ్ లో వ్యవసాయ, మార్కెటిం గ్, పౌరసరఫరాలు, రెవెన్యూ (Agriculture, Marketing, Civil Supplies, Revenue)తదితర శాఖలకు సంబంధించిన సిబ్బంది పని చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడిన, లేదా ఎక్కడైనా ధాన్యం కొనుగోలు జరగకపోయినా వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తెలియజే యవచ్చని, సంబంధిత అధికా రులతో ఆ సమస్యను పరిష్క రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడిం చారు.అదేవిధంగా రాష్ట్రస్థాయిలో సైతం ధాన్యం సేకరణ,కొనుగోలు కు సంబంధించి ఫిర్యాదుల స్వీక రణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిం దని, రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1 9 6 7 లేదా 180042500333 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.