— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా లో ఈ వానా కాలం ధాన్యం కొను గోలులో భాగం గా ఎట్టి పరిస్థితులలో బయటి ధాన్యాన్ని కొనుగోలు చేయకూడ దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి నల్లగొండ జిల్లాకు ధాన్యం రావడాని కి వీల్లేదని అన్నారు. 2024- 25 వానకా లం ధాన్యం కొనుగోలు కేం ద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అయిన ఉదయాదిత్య భవన్ (Udayaditya Bhavan) లో ఏర్పాటు చేసి న శిక్షణ కార్యక్రమానికి హాజర య్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సం వత్సరం సన్నధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నదని, అందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహ కులు, ఆయా శాఖల అధికారులు ధాన్యం కొనుగోలులో పూర్తి జాగ్రత్త లు తీసుకోవాలని అన్నారు. సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం కలిపి కొన కూడదని , సమాధానం కొనుగోలు కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చే యాలని ఆదేశించారు.
సన్నధా న్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ (Bonus)ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున పూర్తి జాగ్రత్తగా ధాన్యం కొనుగోలు చేయాలని , బయటి ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతున్న దని, అంతేకాకుండా జిల్లా సరిహ ద్దులైన వాడపల్లి నాగార్జునసాగర్ ల లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకై ప్రత్యేకించి డిఎస్ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని , ఏదైనా సమస్యలకు సంబంధించి 9963407064 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పారు. అలాగే రాష్ట్రస్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కంట్రోల్ రూమ్ (Control room)వివరాలను ఆయన తెలియజేస్తూ 1967 లేదా 1800-425-00333 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ -ఏ ధాన్యా నికి 2320 /- రూపాయలు, సాధా రణ రకానికి 2300/- రూపాయలు మద్దతు ధర ప్రకటించిందని, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ను అదనంగా ఇస్తున్నదని, రైతులు (farmers) ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని, అలాగే తాలు, మట్టి పెల్లలవంటివి లేకుండా చూసుకోవాలని,ఆ విధంగా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లలో భాగంగా, జిల్లా మార్కెటింగ్ అధికారి టార్పాలిన్లు, దాన్యం తూర్పారబట్టే యంత్రాలు, అలాగే తేమ కొలిచే యంత్రాలను అవసరమైనన్ని ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు .
సన్నధాన్యాన్ని గుర్తించే బాధ్యతను వ్యవసాయ విస్తరణ అధికారులదే అని అన్నారు. వారంలో జిల్లాలో నిర్దేశించిన 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నింటిని ప్రారంభించాలని, ఈ వానాకాలం జిల్లాలో 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చు అని అంచనా వేయడం జరిగిందని, అంతకుమించి ధాన్యం వచ్చిన కొనుగోలు చేసేందుకు సిద్ధం కావాలని ఆయన చెప్పారు. ధాన్యం అంచనాలపై మరోసారి వ్యవసాయ శాఖతో (Department of Agriculture)సమన్వయం చేసుకోవాల్సిందిగా పౌరసరఫరాలు, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు తర్వాత ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మిల్లర్లు సైతం సన్నధాన్యాన్ని ప్రత్యేకంగా మిల్లింగు చేయాలని, అలాగే సన్నధాన్యంలో వెరైటీల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు . ప్రతి ధాన్యం కొనుగోలు (Purchase of grain)కేంద్రానికి ఒక లారీని అనుసంధానం చేయాలని, అవసరమైతే మరిన్ని లారీలు పంపించే విధంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎట్టి పరిస్థితిలో ఉప కేంద్రాలను ప్రారంభించవద్దని ఆయన తెలిపారు.ఈ సమావేశాని కి అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటే శ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్,, డిఆర్డిఏ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, ఎఫ్సీఐ అధికారులు , ఆయా శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.