— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: పైలెట్ పద్ధతిన నిర్వహిస్తున్న కుటుంబ డిజిటల్ కార్డు సర్వే (Family Digital Card Survey)సందర్భంగా ప్రతి ఇంటిని , ప్రతి కుటుంబాన్ని కవర్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) సర్వే బృందాలను ఆదేశించారు. గురువారం ప్రారంభమైన కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం అయ న నల్గొండ మున్సిపల్ పరిధిలోకి వచ్చే 4 వ వార్డు కేసరాజు పల్లి హ్యాపీ హోమ్స్, కేశరాజు పల్లి లో తనిఖీ చేశారు.నల్గొండ మున్సిపా లిటీ లో నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి(RDO Sridevi), మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ ఆధ్వర్యంలో కుటుంబ డిజిటల్ కార్డు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
కేశరాజు పల్లి లోని కుటుంబాలు? గృహాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు సర్వే (survey) చేసిన కుటుంబాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్ డేటా ఆధారంగా సర్వే నిర్వహించా లని ,సర్వేలో ఎట్టి పరిస్థితులలో ఏ ఇంటిని వదిలిపెట్టకూ డదని అలాగే ఏ కుటుంబాన్ని వదలరా దని అన్నా రు. ఏరోజు డేటా ను ఆ రోజే నమోదు పూర్తి చేయాలని ఆదే శించారు. ఫోటోలు తారు మారు కాకుండా చూసుకోవా లన్నారు. అలాగే కుటుంబాల వివరాల సేకరణ సందర్భంగా కొత్త కుటుంబాల నమోదు, ఎవరైనా వివాహమై వెళ్ళిపోయిన వారి తొలగింపు వంటివి ఎంట్రీ (entry)చేయాలన్నారు. ఏ రోజు పని ఆరోజే పూర్తికాలని ,ఎట్టి పరిస్థితులలో నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. సర్వే బృందంలో ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.