–సెప్టెంబర్ 1 నాటికి ఓటరుజాబితా మెర్జింగ్,మ్యాపింగ్ పూర్తి చేయాలి
–మున్సిపాలిటీలు, గ్రామాలలో పా రిశుధ్య కార్యక్రమాలు తీవ్రతరం
–వచ్చే మంగళవారం నుండి శాని టేషన్ ప్లాంటేషన్ పై ఆడిట్ నిర్వ హణ
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోనిమున్సిపాలిటీలు, మం డలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చేవారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైన పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి (Narayana Reddy)ఆదేశించారు.శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, టిపిఓ ఇంజనీర్ రెవిన్ ఇన్స్పెక్టర్లకు (Nakirekal Municipal Commissioner, TPO Engineer Revin Inspectors) మెమో జారీ చేయాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు ఎల్ఆర్ఎస్ బృందాలతో సమన్వయం చేసుకొని ఎక్కువ దరఖాస్తులు పరిష్కరించేలా చూడాలని చెప్పారు.
ఓటరు జాబితా మెర్జింగ్, మ్యాపింగ్ (Voter list merging, mapping)లపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఆర్డిఓల తో సమన్వయం చేసుకొని సెప్టెంబర్ ఒకటి నాటికి టి. పోల్ పోర్టల్ లో మెర్జింగ్, మ్యాపింగ్, పూర్తి చేయాలని,సెప్టెంబర్ మూడవ తేదీ నాటికి మాన్యువల్ పరిశీలన సైతం పూర్తి చేయాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఏ హ్యాబిటేషన్ గ్రామపంచాయతీ కిందికి వస్తుందో అలాంటి వివరాలను తయారు చేయాలని ఆదేశించారు .ఫిబ్రవరి 9 నుండి ఇప్పటి వరకు ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పుల వివరాలు సేకరించాలన్నారు. సెప్టెంబర్ 4 నుండి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరుగుతుందని, నాలుగు నుండి పది వరకు ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉన్నది, లేనిది తనిఖీ చేయాలన్నారు .సెప్టెంబర్ 15 నాటికి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను తనకు పంపించాల్సిందిగా ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఇంకా వైరల్ ఫీవర్స్ తో పాటు, డెంగ్యూ (dengue) వంటి కేసులు నమోదు అవుతున్నాయని, మున్సిపల్ కమిషనర్లు (Municipal Commissioners_ఎంపిడివోలు వైరల్ ఫీవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పారిశుద్యంలో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో గడ్డి మొక్కలు తొలగించే యంత్రాలు, ఫాగింగ్ మిషన్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, గ్రామంలో ఎక్కడ పిచ్చి మొక్కలు కనిపించరాదని, దోమల నివారణకై ఫాగింగ్ విస్తృతంగా నిర్వహించాలని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, శానిటేషన్ ను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలు తప్పనిసరిగా దోమతెరలు వాడేలా చూడాలని, అవసరమైతే ఆశ ,అంగన్వాడీల ద్వారా ఇల్లిల్లు తిరిగి దోమతెరలు వాడుతున్నది లేనిది నిర్ధారించుకోవాలని చెప్పారు. రానున్న మూడు నెలలపాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వారి పరిధిలో జ్వర సర్వేను మరోసారి నిర్వహించాలని, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని, ఫాగింగ్ తో పాటు, స్ప్రేయింగ్ ను, అలాగే మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని తీవ్రతరం చేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు (medical officers)గ్రామాలు తిరిగి జ్వరాలతో బాధపడుతున్న వారిని పరీక్షించడమే కాకుండా, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చైతన్యం చేయాలని, ఈ విషయమై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు .
వచ్చే మంగళవారం నుండి జిల్లా వ్యాప్తంగా శానిటేషన్, ప్లాంటేషన్ పై ఆడిట్ (audit) బృందాలు గ్రామాలు, మున్సిపాలిటీలలో పరిశీలన జరపనున్నాయని, ఈ పరిశీలనలో ఎక్కడైనా పారిశుధ్య లోపం కనపడిన, మొక్కలు లేనట్లు తేలిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు వనమహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమం 99 శాతం పూర్తయిందని, అన్ని సంస్థలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో నాటిన మొక్కలన్నింటిని పరిశీలించడం జరుగుతుందని ,ఏ ఒక్క అధికారి మొక్కలు విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, అవసరమైతే మొక్కలు లేని చోట సంబంధిత అధికారుల నుండి రికవరీ చేస్తామని హెచ్చరించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి తో పాటు, ఆర్డీవోలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీ వోలు ఎంపీలు ఇరిగేషన్ ఏఈలు తదితరులు హాజ రయ్యారు.