Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: సాగునీటిని రైతులు మళ్ళిoచొద్దు

— జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)నీటితో జిల్లాలోని అన్ని చెరు వులు నింపనున్న దృష్ట్యా రైతులెవ రు సాగునీటిని మళ్ళించుకోకూడ దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు.శనివారం ఆయన నాగార్జు నసాగర్ నీటి వినియోగం పై రెవె న్యూ, పోలీస్,ఇరిగేషన్, మండల స్థాయి (Reve New, Police, Irrigation, Mandal Level) అధికారులతో టెలికాన్ఫరె న్స్ నిర్వహించారు.

నాగర్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్ర వారంసాగు నీటిని విడు దల చేసిన దృష్ట్యా శనివారం నుండే జిల్లాbలోని అన్ని ట్యాంకులను నీటి తో నింపనున్నట్లు చెప్పారు. ఎడమ కాలువ ద్వారా 10 నుండి 11 వేల క్యూసెక్కుల నీటిని వదలడం జరు గుతున్నదని, ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగి పోయేందుకు లేదా గండ్లు పడేందుకు ఆస్కారం ఉంటే ముందే గుర్తించి తక్షణమే వాటిని అరికట్టాలని అన్నారు.

ముఖ్యంగా రైతులెవరు సాగునీటిని తొందరపడి మళ్లించుకోవద్దని ,వారం రోజుల్లో అన్ని ట్యాంకులను నింపుతామని కోరారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని చెరువులన్నిటిని ఒకటికి రెండుసార్లు తిరిగి పరిశీలించి ఎక్కడైనా తెగిపోయేందుకు ఆస్కారం ఉన్న చెరువులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ఈ విషయాన్ని ముందే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

నిర్దేశించిన ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, అలాగే మండల బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.లస్కర్ లందరూ కాల్వపై అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క చెరువు తెగిపోవడానికి వీలులేదని, ఎంపీడీవో, తహసిల్దార్,, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లు సాగర్ (Sub Inspectors Sagar)నీటిని సక్రమంగా వినియోగించుకో వడంలో ముఖ్యపాత్ర వహిం చాలని, అదేవిధంగా ఆర్డీవోలు, డిఎస్పీలు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

గ్రామపంచాయ తీ కార్యదర్శుల ద్వారా ఎప్పటి కప్పుడు సాగునీటిని పర్యవేక్షణ చేయాలని ,సాగు నీరు ఎక్కడ దారి మల్లకుండా చూడా లన్నారు. సంవత్సరం తర్వాత నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా విడుదల చేయడం జరుగుతున్నదని అందువల్ల రైతులు పంటలు పండించు కునేందుకు ఒక చక్కని అవకాశం అని, సాగునీ టిని సక్రమంగా వినియోగించుకోవడంలో రైతుల తోపాటు, ఇంజనీరింగ్, రెవి న్యూ ,పోలీస్ (Engineering, Revenue, Police) అన్ని శాఖల అధి కారులు సహకరించాలని కోరారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ సాగి నీటి సక్రమ నిర్వహణకు గాను పోలీస్ శాఖ తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని, అంతేకాక బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల స్థాయిలో ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా సహక రించాలని ఆదేశించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగే శ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎడమ కాలువ నుండి సాగునీటి విడుదలను ప్రతిరోజు పెంచుకుంటూ పోతామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, ఆర్డీవోలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీ రింగ్ అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.