Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: త్వరగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో సాధ్యమైనంత త్వరగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నా రాయణరెడ్డి (Narayana Reddy)ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మంది రంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదు లను స్వీకరించారు. అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారుల తో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్ గా , స్వ యం సహాయక మహిళ సంఘాల నుండి ఇద్దరు , ఎస్ సి, ఎస్టీ ,బీ సీ ,ఇతరుల నుండి ముగ్గురు, (SC, ST, BC, three from others,) కన్వీనర్ గా గ్రామ పంచాయతీ కార్యదర్శి తో గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే మున్సిపల్ పట్టణ స్థాయిలో వార్డ్ కౌన్సిలర్ లేదా ప్రత్యేక అధికారి చైర్మన్ గా, స్వయం సహాయక మహిళా సంఘాల నుండి ఇద్దరు, ఎస్ సి, ఎస్టీ ,బీసీ, ఇతరుల నుండి 3, వార్డు అధికారి కన్వీనర్ గా ఉండేలా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ మొత్తం ప్రక్రియ మంగళవారం నాటికి (14.10.2024) పూర్తి చేయాలని ఆదేశించారు.

గతంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి బ్యాంకు మార్టి గేజ్ నుండి రిలీజ్ ఆయన పట్టాలను మండలాలు, గ్రామాల (Pattalan mandals and villages) వారి గా జాబితా రూపొందించి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేక అధికారులు ఈ నెల 16 న వారి మండలాలకు వెళ్లి పర్యవేక్షించాలని చెప్పారు.జిల్లాలో తక్షణమే నిర్దేశించిన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించా లని ఆదేశించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్త యిన చోట లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని చెప్పారు.

ప్రజావాణి కార్యక్రమం (Public radio program) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటిని వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచ వద్దని తెలిపారు .ఈ సోమవారం మొత్తం( 34) మంది ఫిర్యాదులు దారులు వారి ఫిర్యాదులను సమ ర్పించగా అందులో రెవెన్యూ శాఖ కు సంబంధించి (24),ఇతర శాఖలకు సంబంధించి (10) ఫిర్యాదులు ఉన్నాయి.అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిం చారు.