— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, తిప్పర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సన్నవ డ్లు ,దొడ్డు వడ్లు వేరువేరుగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డి (Narayana Reddy)ధాన్యం కొను గోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. రైతులు సైతం సన్న వడ్లు, దొడ్డు వడ్లను వేరు వేరుగా కేంద్రాలకు తీసుకువచ్చి సహకరిం చాలని కోరారు.మంగళవారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో (Market Yard) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుండి చౌక ధర దుకాణాల (Cheap price shops)ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించిందని, అందువల్ల సన్న వడ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని, దీనివల్ల రైతులకు, కార్డుదారులకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రత్యేకించి రైతులకు లాభం చేకూర్చేందుకు సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను సైతం ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ వానాకాలం పండించిన గ్రేడ్-ఏ ధాన్యానికి 2320/ రూపాయలు, సాధారణ రకానికి 2300/- రూపాయలు క్వింటాలకు మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తున్నదని, సనధాన్యానికి మరో 500 రూపాయల బొనుస్ ను అదనంగా ఇస్తున్నదని తెలిపారు. అందువల్ల ఎట్టి పరిస్థితులలో దొడ్డు ధాన్యాన్ని సన్నధాన్యాన్ని మిక్స్ చేయవద్దని చెప్పారు .సనాధాన్యంలో సైతం వెరైటీ వారిగా రైస్ మిల్లులకు పంపించి సన్నబియ్యాన్ని (Small rice) పొందినట్లయితే సన్న బియ్యం తినే అందరికీ మేలు జరుగుతుందని అన్నారు.
రైతులు ప్రైవేటు మిల్లర్లకు (Millers) ధాన్యాన్ని అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఇంకా నెలరోజుల పాటు వర్షాలు వచ్చేందుకు అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలలో వర్షానికి ధాన్యం తడవకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఎప్పుడు కొన్న ధాన్యం (grain)అప్పుడే మిల్లులకు పంపించే విధంగా లారీలు ,హమాలీలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తూకం వేసే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు అన్ని సిద్ధంగా ఉంచాలని అన్నారు.తేమ శాతం 17 కన్నాతక్కువ ఉన్న వాటిని అదే రోజు సాయంత్రంలోగా కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ,కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. జిల్లాలో తిప్పర్తి ధాన్యం కొనుగోలు సెంటర్ కు ప్రత్యేక స్థానం ఉందని, గతంలో సైతం పెద్ద ఎత్తున ఇక్కడి నుండి ధాన్యం కొన్నట్టు తెలిపారు.
ఈ సంవత్సరం జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాల (Grain buying centres_ ను ఏర్పాటు చేస్తున్నామని, గతం కంటే 100 కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి గ్రామం నుండి దాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,తదితరులు మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ ,పి ఏ సి ఎస్ చైర్మన్ సంపత్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి రామి రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డిసిఒ ,ఇతర అధికారులు ,ప్రజా ప్రతినిధులు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.