Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: నూరు శాతం ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాలి

–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, మునుగోడు: నూటికి నూరు శాతం ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించేం దుకు అధికారులు కృషి చేయా లని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా చండూరు మున్సిపా లిటీలో మునుగోడు శాసనసభ్యు లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో (Komatireddy Rajagopal Reddy) కలిసి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ పరిధిలో అలాగే చండూరు మం డలంలో చేపట్టిన పను లు,ఇటీ వల కురిసిన భారీ వర్షాల కారణం గా ప్రజలు సీజనల్ వ్యాధుల బారి న పడకుండా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గ్రామపంచాయతీ మొదలుకొని మండల, మున్సిపల్ (Mandal, Municipal) స్తాయి వరకు అధికారులు అంద రూ సక్రమంగా పనిచేయాలని, విద్య ,వైద్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ,ప్రజలకు కనీస సేవలైన తాగునీరు, రోడ్లు, పారిశు ధ్యం,విద్య ,వైద్యం ,విద్యుత్ ,ధరణి తదితర సేవలను సక్రమంగా అం దించేలా చూడాలని ఆదేశించారు. ఆయా అంశాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాలను చూడాలని, మండలంలోని సబ్ సెంటర్లను (Sub-centres) సరైన ప్రాంతాలలో నిర్మించేందుకు నాలుగైదు రోజుల్లో స్థలాలు చూడాలని, ఇందుకు అవసరమైన అంచనాలను రూపొందించి పంపాలని, గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎంలు ఎక్కువ జ్వర కేసులు నమోదైన గ్రామాలలో మరోసారి సర్వే చేయాలని, పంచాయతీ కార్యదర్శులు, సానిటేషన్, తాగు నీరు పై దృష్టి సాధించాలని ఆదేశిం చారు. విద్యపై జరిగిన సమీక్షలో భాగంగా చండూరులోని ఉన్నత పాఠశాల మరో రెండు పాఠశాల లపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి నాణ్యత పై దృష్టి సారించాలని, ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగు నీరు, టాయిలెట్లు, విద్యుత్ (Drinking water, toilets, electricity) పక్క గా ఉండేలా చూదాలని, అలాగే ల్యాబ్ లు, కనీసం మూడు క్రీడల పై సామాగ్రి ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి చండూరు హైస్కూల్ పై ఎక్కువ దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోకుండా చూసుకో వాలని ఆదేశించారు.ధరణికి సం బంధించి ఒక్కో గ్రామం వారిగా సర్వేనెంబర్ వారిగా తనిఖీ చేయా లని, ప్రభుత్వ సర్వే నంబర్లను తనిఖీ చేసి వారికి పట్టా పాసు బుక్కులు ఇచ్చింది లేనిది తనకి చేయాలని ఆదేశించారు.

గ్రామ పంచాయతీల పనితీరును సమీ క్షిస్తూ పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీలు (Secretaries, Gram Panchayat) ఇంకా బాగా పనిచేయాలని అన్నారు. మున్సిపా లిటీలో పిచ్చి మొక్కలు ఉండకుం డా చూడాలని, రోడ్లపై చెత్తా చేదా రం ఉండకుండా డంపింగ్ యార్లలో వేయాలని ,15 రోజుల తర్వాత మరోసారి చండూరు మున్సిపాలిటీ ని తనిఖీ చేయడం జరుగుతుం దని, చండూరు మున్సిపల్ పరిధి లో, అలాగే గ్రామపంచాయతీలకు సంబంధించి 10% లేఔట్లలో ఆక్రమ ణలు ఉన్నట్లయితే అటువంటి వివరాలను తక్షణమే సమర్పిం చాలని ,చండూరు మున్సిపాలిటీ లో రహదారులు ఆక్రమించి అక్ర మంగా నిర్మిస్తున్న నిర్మాణాలను ఆర్ అండ్ బి ఏ ఈ, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్. లు తనిఖీ చేసి సరైన చర్య తీసుకోవాలని ఆదేశించారు.విద్యుత్ అధికారులు గ్రామాలు, మున్సిపాలిటీలో (Electricity authorities are villages and municipalities) ప్రజ లు షార్ట్ సర్క్యూట్ కు గురి కాకుం డా ఏర్టింగ్ రాకుండా చర్యలు తీసు కోవాలని ,తుప్పు పట్టిన స్తంభాలు తొలగించాలని, లైన్లు సరిచేయా లని, మరో నెల రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన మును గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.

పాఠశాలల స్కా వెంజర్ల కోసం డిఎంఎఫ్టి నుండి నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఉన్నత పాఠశాలలో గర్ల్స్ టాయిలెట్స్ కోసం అంచ నాలు రూపొందించి పంపించాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుప త్రికి వచ్చిన కేసులు బయటికి వెళ్లడానికి వీలులేదని తెలిపారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో (Government hospitals) ప్రసవాల సంఖ్యను పెంచాలని, చండూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, మండలంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భవనాల నిర్మాణానికి స్థలాలను చూడాలని కోరారు.

ప్రాథమిక వైద్య రోగ్య కేంద్రం తనికి సందర్భంగా ఆయన అక్కడ ఇన్ పెషెంట్లు, ఆస్పత్రిలో (Inpatients, Hospital) నిర్వహిస్తున్న పరీక్షలు, సౌకర్యాలు తదితర అంశాలను ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం డాక్టర్ రాజును అడిగి తెలుసుకున్నారు. అనం తరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లను సందర్శించి అక్కడ ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యనభశించేందుకు 30 గదుల భవన నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక రూపొం దించాలని, పక్కనే ఉన్న కేజీబీవీ బాలికల పాఠశాల విద్యార్థినిలకు టాయిలెట్ సౌకర్యం వంటి వాటిని సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో తరగతి గదిలోకి (room)వెళ్లి పరిశీలించారు .ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న స్థలాన్ని మొత్తాన్ని సర్వే చేసి రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయి విధంగా భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

అనంతరం ఆర్డీవో కార్యాల యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో (Review meeting)ఆయన మాట్లాడు తూ చండూరులో మంచి విద్యను అందించేందుకు 5 ఉన్నత పాఠశాలలు, 5 ప్రాథమిక పాఠశా లలు ఎంపిక చేసి పూర్తిస్థాయిలో సౌకర్యాలను కల్పించి విద్యార్థు లకు విద్యను అందించాలని విద్యాశాఖ అధికారులను కోరారు . భూముల విషయంలో వివాదాల తో కోర్టు కేసుల దాకా వెళ్లకుండా చిన్నచిన్న విషయాలను తహ సిల్దారు, ఆర్డిఓ పరిధిలోనే పరిష్క రించాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యం. కు సూచించారు.మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉందని తెలుసుకుని రెండు చిన్న గ్రామాలకు ఒక పంచాయతీ కార్య దర్శిని ఇన్చార్జిగా నియ మించాల ని, గ్రామాలలో నీరు నిలువ ఉండ కుండా చూడాలని, గ్రామం మధ్య లో ఖాళీ ఉన్న స్థలాల యజమాను లకు నోటీసు లు జారీ చేసి తక్షణ మే వాటిలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించే ఏర్పాటు చేయా లని, అలాగే గ్రామం వెలుపల, బయట పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి డంపింగ్ యార్లలో వేయించాలని, మురికి కాలువలను శుభ్రం చేయించాలని గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించారు.అదేవిధంగా చండూ రు మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త వేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను గుర్తించి ప్రజలను అక్కడే చెత్త వేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశిం చారు. ఖాళీ స్థలాల యజమా నులకు నోటీసులు ఇచ్చి వాటిని శుభ్రం చేసే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు.

ప్రస్తుతం ఉన్న మురికి కాలువలు పూడికతో పూడుకుపోవడం, కొన్నిచోట్ల పడిపోవడం వంటి కారణాలతో మురుగునీరు రోడ్లపైకి వస్తున్నదని తక్షణమే వాటి మరమ్మతుకు అంచనాలు రూపొందించి సమర్పించాలని ప్రజారోగ్య ఇంజనీర్ ను ఆదేశించారు. అక్టోబర్ వరకు ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని లేనట్లయితే ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. టి ఎఫ్ ఎం ఐ డి సి, అమృథ్ తదితర పథకాల కింద చేపట్టిన రోడ్లు, తాగునీటి పనులను వెంటనే ప్రారంభించారు. ప్రత్యేకించి రోడ్డు పనులను బుధవారం నుండే ప్రారంభిం చాలని, అలాగే అమృథ్ పథకం కింద పనులను సైతం వెంటనే ప్రారంభించాలని చెప్పారు. చం డూరు మున్సిపాలిటీలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు.

మున్సిపాలిటీలో రహదా రులపై అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల ను పరిశీలించి అటువంటి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరా రు.197 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి విద్యుత్ సౌక ర్యాలు ఏర్పాటు చేయడం జరిగిం దని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని రెసి డెన్సియల్ పాఠశాలలు ,వసతి గృహాలలో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో షార్టు సర్క్యూట్ కు గురి కాకుండా చర్యలు తీసు కోవాలని ,విద్యాసంస్థలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేం ద్రాల వంటి ముఖ్యమైన సంస్థలకు ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికా రులను ఆదేశించారు.స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పొట్ల శ్రీనివాస్ ,ఆర్డీవో సుబ్రహ్మ ణ్యం,ప్రజారోగ్య ఈ ఈ సత్యనారా యణ ,మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసిల్దార్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సమక్షా సమావేశానికి హాజ రయ్యారు.