–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారయణ రెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ; రైతు రుణమాఫీలో (Farmer loan waiver)భాగంగా నల్గొండ జిల్లాలో రెండవ విడత లక్షన్నర లోపు రుణాలు ఉన్న 43,130 రైతు కుటుంబాలకు సంబంధించిన 50,409 బ్యాంకు ఖాతాలలో 503.89 కోట్ల రూపా యల రుణాలు మాఫీ కానున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి లక్షన్నర రూపా యల లోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్ లో ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత జిల్లాలో లక్ష రూపాయలలోపు ఋణాలున్న 7 8757 రైతు కుటుంబాలకు సంబంధించి 83121 బ్యాంకు ఖాతాలలో 481.63 కోట్ల రూపాయల రుణమాఫీ జమ చేయడం జరిగిందని తెలిపారు. రెండో విడత రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర రూపాయల లోపు రుణ మాఫీలో భాగంగా,6198 కోట్ల రూపాయలు విడుదల కాగా ఒక్క నల్గొండ జిల్లాకే 503.89 కోట్ల రూపాయలు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు .ఈ సందర్భంగా ఆయన జిల్లాలలో లక్షన్నర రూపాయలలోపు రుణాలు మాఫీ (Waiver of loans)అవుతున్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు .ఆగస్టు నాటికి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ సైతం జరగనుందని తెలిపారు. మొదటి విడత 481 కోట్లకు గాను 465 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయ్యాయని, సాంకేతిక కారణాల వల్ల కేవలం 456 బ్యాంకు ఖాతాలలో మాత్రం రుణమాఫీ కాలేదని అయన వెల్లడించారు.
రెండో విడత లక్షన్నర రూపాయల లోపు రుణమాఫీలో భాగంగా బుధవారం నుండి అన్ని మండలాలలో వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో వచ్చే సోమవారం వరకు రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని నిరంతరం నడిచేలా చూడాలని, వచ్చే సోమవారం ప్రజావాణిలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు .ఎవరికైనా రైతులకు లక్షన్నర లోపు రుణమాఫీ (Waiver of loans) కానట్లయితే వెంటనే వారి సమస్యను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు .ఈ ఫిర్యాదుల విభాగాలు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించాలని తెలిపారు. అదే విధంగా బ్యాంకులలో సైతం ఒక నోడల్ అధికారిని ప్రత్యేకంగా రుణమాఫీ కై ఏర్పాటు చేసి ఎవరైనా రైతులు రుణమాఫీ విషయమై వచ్చేవారికి అకౌంట్లు పరిశీలించి వారికి తెలియజేయాలని ఆదేశించారు. రుణాల రెన్యువల్ పై సైతం బ్యాంకర్లు వ్యవసాయ అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మొదటి విడత 84 వేల బ్యాంకు ఖాతాలకు గాను ఇప్పటివరకు 23 వేల బ్యాంకు ఖాతాలకు రుణాలు రెన్యువల్ చేయడం జరిగిందని, 158 కోట్ల రూపాయలు రెన్యువల్ చేశామని వెల్లడించారు. తక్కిన అకౌంట్లకు సైతం ఆగస్టు 9 వరకు రుణాలు రెన్యువల్ (Renewal of loans) చేయాలని ఆదేశించారు. రెండవ విడత లక్షన్నర లోపు రుణాల మాఫీ సందర్భంగా అన్ని అకౌంట్లకు రుణాలను రెన్యూవల్ చేయాల్సిందిగా ఆదేశించారు .బ్యాంకర్లు ఎట్టి పరిస్థితులలో రైతులకు మాఫీ అయిన రుణ మొత్తాన్ని ఇతర లోన్లకు పట్టుకోవద్దని చెప్పారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే రుణమాఫీని తీసుకురావడం జరిగిందని, అందువల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా బ్యాంకర్లు సహకరించాలని ఆయన కోరారు.
డిసిఎంఎస్ చైర్మన్ బోల్ల వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ మాట్లాడారు. కాగా రాష్ట్ర శాసనసభ నుండి రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు మాట్లాడుతూ, రైతు రుణమాఫీ లో భాగంగా రెండవ విడత రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ కానున్న రైతులు ,మాఫీ అయ్యే నిధులవివరాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ,జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జెడ్పిటిసి తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అయిన పలువురు రైతులు మాట్లాడుతూ “ఒకేసారి తమకు లక్ష, లక్షన్నర, రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడం సంతోషంగా ఉందని, గతంలో రుణమాఫీ జరిగినప్పటికీ విడతలవారీగా సంవత్సరం పొడుగునా రుణమాఫీ జరిగిందని, ఈ మొత్తం వడ్డీలకే సరిపోయాయని ,ఇప్పుడు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణ మాఫీ చేయడం వల్ల తమకు ఎంతో ఉపయోగక రంగా ఉందని అన్నారు. వారు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంక్అధి కారులు, వ్యవసాయ అధికారులు, ఎన్నో నియోజక వర్గాల నుండి ఎంపిక చేసిన రైతులు ,తదితరులు హాజరయ్యారు. కాగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన రెండవ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో వీక్షించే ఏర్పాటు చేయడం జరిగింది.