–గృహ ,విద్య రుణాల యూనిట్ల లక్ష్యాలను 50 శాతం పూర్తి చే యాలి
–సూక్ష్మ తరహా యూనిట్ల గ్రౌండింగ్ కు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి
— నల్లగొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడినందున బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) కోరారు. ప్రత్యేకించి ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంట రుణాలన్నింటిని నవంబర్ 5 నాటికి నూటికి నూరు శాతం ఇవ్వాలని చెప్పారు. అలాగే వార్షిక పంట రుణాలలో సైతం 50 శాతం లక్ష్యాలను సాధించాలని చెప్పారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రాధాన్యత రంగంలోకి వచ్చే గృహ నిర్మాణ, విద్యా రుణాల గ్రౌండింగ్ (Grounding of housing and education loans) లక్ష్యాలను 50 % పూర్తి చేయాలని అన్నారు. అలాగే సూక్ష్మ తరహా రుణాల లో భాగంగా కనీస యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు 3 ప్రత్యేక శిబిరాలను నిర్వహించాల్సిందిగా బ్యాంకర్లతో కోరారు. ఐకెపి, మెప్మా ద్వారా అమలు చేసే బ్యాంకు రుణాలకు సంబంధించి జాబితాను రూపొందించి సంబంధిత బ్యాంకులకు తక్షణమే పంపించడం ద్వారా లబ్ధిదారులకు బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసే యూనిట్లలో సైతం 50% యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ శాఖల ద్వారా బ్యాంకుల సహకారంతో అమలు చేసే యూనిట్లను జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఎస్సి, ఎస్టీ (SC, ST)తదితర యూనిట్లను వచ్చే బ్యాంకర్ల సమావేశం నాటికి అన్ని యూనిట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇకపై నిర్వహించే బ్యాంకర్ల కమిటీ సమావేశానికి (bankers committee meeting)తప్పనిసరిగా ఆయా బ్యాంకుల నియంత్రణ అధికారులు మాత్రమే హాజరయ్యే లా చూడాలని ఆయన కోరారు. వ్యవసాయ పంట రుణాల తో పాటు, ఆర్థిక చేయూత యూని ట్లు, తదితర యూనిట్లు అమలు చేయడంలో ట్యాంకర్లు చొరవ చూపాలని ఆయన తెలిపారు. పంట రుణాల తోపాటు, బ్యాంకర్లు రుణాల రెన్యూవల్ పై దృష్టి సారించాలని అన్నారు. మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డి ఎఫ్ ఓ రాజశేఖర్, ఎల్ డి ఎం శ్రామిక్, ఆర్బిఐ ఎజిఎం పృథ్వి,నాబార్డ్ డీడీఎం సత్యనారాయణ, ఏపీజీవీబీ ఏజీఎం విజయభాస్కర్, ఇతర బ్యాంకు నియంత్రణ అధికారులు, జిల్లా పరిశ్రమల శాఖ జె డి జి.కోటేశ్వర రావ్,వ్యవసాయ శాఖ జె.డి శ్రవణ్,ఇంచార్జ్ డిటీడీవో రాజ్ కుమార్,ఎస్ సి కార్పొరేషన్ ఈ డి , తదితరులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.