Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ప్రాధాన్యత క్రమంలో భూసేకరణ

— నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: వివిధ ప్రాజెక్టుల కింద భూసేకర ణను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి (Narayana Reddy) ఇంజనీ రింగ్ ,రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ పై గురువారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహిం చారు.ప్రాజక్ట్ ల కింద భూ సేకరణకు గుర్తించిన భూమి, ముందుగా అత్యవసరంగా అవసరమయ్యే భూమి జాబితా తయారు చేసుకు ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అన్నా రు. ఇందు కుగాను రెవెన్యూ ఇంజ నీ రింగ్ అధికారులు (Revenue Engineering Officers) సమన్వయం తో పని చేయాలన్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములు, ఫారెస్ట్ భూముల విషయంలో ఆర్డీవో ,తహసిల్దార్ ,డీఎస్ఓ లు (RDO, Tehsildar, DSO) సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే పరిష్కరించాలని అన్నారు .

భూసేకరణ బడ్జెట్ (Land acquisition budget)కు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ తెలిపారు.అన్ని ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ పివి స్థాయిలో ఉన్న వాటన్నిటికీ వారం రోజుల్లో అవార్డు పాస్ (Award pass)చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ,సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. పట్టా భూములు ,జనరల్ అవార్డులకు సంబంధించి రైతుల సమ్మతితో అవార్డులు పాస్ చేయాలని సూచించారు.ఇక పై ప్రతివారం క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించడం జరుగు తుందని కలెక్టర్ వెల్లడిం చారు.నెల్లికల్, నక్కలగండి తదితర ఎత్తిపోతల పథకాల కింద ఫారెస్ట్ భూములకు సంబంధించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ముందుకు వెళతామని డిఎఫ్ఓ రాజశేఖర్ తెలిపారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఎఫ్ఓ రాజశేఖర్, ఆర్డీవోలు శ్రీరాములు, సుబ్రమ ణ్యం, శ్రీదేవి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.