— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారా యణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ఎత్తిపోతల పథకాల కు అవసరమైన భూముల కై వెంటనే భూసేకరణ ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణ పై నీటిపారుదల,రెవెన్యూ అధికారులతో (Tiparudala with revenue officers)టెలికాన్ఫర్ న్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని డివిజన్ల పరిధిలో చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి అవసరమయ్యే భూముల పూర్తి వివరాలుతో ప్రతిపాదనలు పంపించాలని, ఎక్కడైనా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు ఉన్నట్లయితే వెంటనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని,అలాగే పట్టా భూములు (Patta lands) ఉంటే సంబంధిత రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అలాంటి భూములను సైతం సేకరిస్తామని, లిఫ్ట్ ఇరిగేషన్ (Lift irrigation will also be collected)కింద ఎక్కడ భూములు అవసరమో వాటి వివరాలన్నింటిని తక్షణమే పంపించాలని ఆదేశించారు.
మిర్యాలగూడ డివిజన్లో నెల్లికల్ స్టేజ్1 కు సంబంధించి 7.4 ఎకరాలకు వారంలోపు పి ఎన్ జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను సోమవారం నుండి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో (With Irrigation and Revenue Officers)సంయుక్త తనికి బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల భూ సేకరణకు సోమవారం నుండి అన్ని మండలాలలో సంయుక్త తనిఖీలు ప్రారంభించాలని ఆయన అన్నారు. డిండి కింద దేవరకొండ డివిజన్ పరిధిలో అంబాభవాని, కంబాలపల్లి, పొదిల్ల లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన భూసేకరణ పై ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు సరైన విధంగా ప్రణాళిక తయారు చేయాలని, ఏలాంటి సమస్యలు ఉన్న ఈ నెల చివరినాటికి అన్ని పరిష్కరించాలని, భూమి లేని కారణంగా ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగకూడదని అన్నారు .లిఫ్ట్ ఇరిగేషన్ల పూర్తి లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత వారి పై ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్డీవోలు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టుల భూ సేకరణ పనులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణ పనులు చూసే విభాగం సైతం లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఆయా లిఫ్ట్ ఇరిగేషన్ల భూసేకరణ సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ తో వివరాలను తెలియజేశారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్డీవోలు, తదితరులు హాజరయ్యారు.