— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు ప్రమాదాలు సంభ వించకుం డా నివారించ గలిగితే మనుషుల ప్రాణాలు రక్షించడమే కాకుండా, కుటుంబాలను నిలబెట్టిన వారమ వుతామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా క లెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. జాతీయ ,రాష్ట్ర రహదారులు, అలాగే ఇతర రహదారులపై ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను పోలీసు , ఇంజనీరింగ్ అధికారుల సంయుక్త బృందాలు తనిఖీ (Check out the teams) చేసి సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రత్యేకించి పోలీసు అధికారుల సూచనలను మేరకు సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ చెప్పారు.
వర్షాల వల్ల గుంతలు పడిన అన్ని రహదా రులను వెంటనే మరమ్మతులు చేయిం చాలని, అలాగే రహదారు ల మలుపుల వద్ద ముళ్ళపొదలు, చెట్ల కొమ్మల వల్ల ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉన్న వాటిని గుర్తించి తొలగించాలని కలెక్టర్ సూచించారు. అలాగే జాతీయ రహదారులపై అనధి కారిక రోడ్డు క్రాసింగ్ (Road crossing) లను మూసి వేయాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలలో రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా అవ గాహన కార్యక్రమాలు నిర్వ హిం చేందుకు షెడ్యూల్ తయారు చేయాలని, పోలీస్ కళాజాత, డిపిఆర్ఓ (Police Kalajata, DPRO) కళాజాత ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిం చాలని ,కళాజాత తో పాటు, మెడికల్ బృందం ,పోలీస్, రెవెన్యూ ఇతర బృందాలతో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేప ట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశిం చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై తోపాటు, ఇతర రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాలపై సైతం రహదారుల అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు కలిసి పనిచేయాలన్నారు .15 రోజుల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల గుంతలు పూడ్చడం,ముళ్ళపోదలు ,చెట్ల కొమ్మలు తొలగించడం పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sarat Chandra Pawar) మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి (rand b), పంచాయతీరాజ్ ,జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో అన్ని రహదారులపై తనిఖీ నిర్వహించి ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, అంతేగాక గుర్తించిన ప్రదేశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, సబ్ ఇన్స్పెక్టర్లు సహకారంతో స్పీడ్ బ్రేకర్లు, లైట్లు, స్టాపర్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలిపారు.
తనతోపాటు, అడిషనల్ ఎస్పీ డిఎస్పీలు (SP DSP) ప్రమాదాలు ఎక్కువగా సంభవించేందుకు అవకాశమున్న మండలాలను దత్తత తీసుకొని పనిచేస్తున్నామని, ఇక్కడ మంచి ఫలితాలు వచ్చినందున మరో ఐదు మండలాలను ఎంపిక చేసుకొని పనిచేయడం జరుగుతుందని, రానున్న రెండేళ్లలో జిల్లా మొత్తం కవర్ చేయడం ద్వారా బ్లాక్ స్పాట్స్ లో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్, ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు రోడ్లపై ముళ్లపోదలు ,చెట్ల కొమ్మల (Thorns and tree branches on the roads) వల్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్నవి గుర్తించి వాటిని తొలగించాలని, అలాగే అవసరమైన చోట వెలుతురు ఉండేలా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్టీవో లావణ్య, పోలీసు అధికారులు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.కాగా పోలీస్, రహదారుల ఇంజనీరింగ్ అధికారులు సంయుక్త తనిఖీల సందర్భంగా గుర్తించిన బ్లాక్ స్పాట్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది.