Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: అధ్యయనానికి నల్లగొండ జిల్లా చక్కని వేదిక

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: అభివృద్ధి, సంక్షేమ పథకాల (Development and welfare schemes)అధ్యయనానికి నల్గొండ జిల్లా చక్కని వేదిక ఆని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి(Narayana Reddy) అన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం నిమిత్తం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించబడిన 21 మంది ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా వివరాలను తెలియజేస్తూ తెలంగాణలోనే నల్గొండ జిల్లా పెద్దదని , 33 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లతో ఏర్పాటైందని, జిల్లాలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అని, జిల్లాలో అన్ని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతున్నదని, వీటన్నిటిని అధ్యయనం చేసేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలు జిల్లాలో ఉన్నందున సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (Central Civil Services) ప్రొబేషనరీ అధికారుల బృందానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. సెంట్రల్ సర్వీసెస్ (Central Civil Services)అధికారుల బృందం అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ,మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy) మానవ వనరుల అభివృద్ధి సంస్థ దిశ, నిర్దేశం ప్రకారం గ్రామాలలో అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనం చేయవచ్చని తెలిపారు.

ముఖ్యంగా ఇక్కడి ప్రజల జీవన విధానం ,సామాజిక ,ఆర్థిక పరిస్థితులు, పాఠశాలలు ,అంగన్వాడీ కేంద్రాలు, (People’s way of life, social and economic conditions, schools, Anganwadi centers) ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు,రైతు వేదికలు తదితర అన్ని పథకాలను అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయని, వారం రోజులపాటు నిర్వహించనున్న ఈ అధ్యయనానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ, సహకారాలను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబాలు వ్యవసాయ, ఉద్యాన అంశాలకు సంబంధించిన విషయాలపై వివరించారు.

కాగా ఈ అధికారుల బృందంలో ఐ ఏ ఎస్, ఐపీఎస్ ,పోస్టల్ తదితర(IAS, IPS, Postal) అధికారులు సైతం ఉన్నారు. వీరు ఈనెల 21 నుండి 24 వరకు జిల్లాలోని పీఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెం, చింతపల్లి మండలం జర్పుల తండా, దేవరకొండ మండలం కర్నాటి పల్లి, కొండమల్లేపల్లి మండలం ఇస్లావత్ తాండ గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై (Development welfare programs)అధ్యయనం చేయనున్నారు. 25న సంబంధిత మండలం లోని మేజర్ గ్రామపంచాయతీలో అధ్యయనం చేసిన తర్వాత, 26 ,27 తేదీలలో దేవరకొండ, నాగార్జునసాగర్ మున్సిపాలిటీలలో అధ్యయనం చేయనున్నారు. అనంతరం 28వ తేదీ నల్గొండ జిల్లా కేంద్రంలో మరోసారి జిల్లా కలెక్టర్ ను కలిసి వారి అధ్యయనం అనుభవాలను వివరించనున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ ,జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జి. కోటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్ తదితరులు ఉన్నారు.