— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: అంకిత భావం, కష్టపడే మనస్తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవ చ్చని జిల్లా కలెక్టర్ సి. నారాయ ణరెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(RSETI) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళ అభ్యర్థుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
జీవితంలో ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలని, అయితే ఏ రంగంలోనైనా పోటీ సాధారణమని, ప్రత్యేకించి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ (Self Employed Training)సంస్థ ద్వారా వ్యాపార రంగంలో స్థిరపడాలనుకుని శిక్షణ పొందిన మహిళ అభ్యర్థులు అంకితభావంతో, కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా రాణిస్తారని అన్నారు. ముఖ్యంగా వ్యాపారమనేది నమ్మకం, నాణ్యత , సమయం పై ఆధారపడి ఉంటుందని, వ్యాపార రంగంలో రాణించేందుకు పోటీ ని ఎదుర్కోవాలని, అలాగే నష్ట భయం ఉంటుందని, పెట్టుబడి పెట్టడం ఒకటే మార్గం కాదని, పెట్టుబడి తో పాటు, కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతం (Rural area) నుండి వచ్చిన అభ్యర్థులు లక్ష్యం పెద్దగా ఏర్పాటు చేసుకోవాలని, అలాగే వ్యాపారంలో వ్యాపారం ప్రారంభించిన వెంటనే ఎక్కువ లాభాలు రావాలని ఆశపడకుండా, దశలవారీగా అంచెలంచెలు గా పైకి ఎదగాలని, అవకాశాల కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన టైలరింగ్ ఎంబ్రాయిడరీ (Tailoring embroidery)లలో శిక్షణ పొందిన 88 మంది మహిళ అభ్యర్థులకు ధ్రువపత్రా లను అందజేశారు.గ్రామీణ స్వ యం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఈ. రఘుపతి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 5000 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపా రు. ఇటీవల టైలరింగ్ ఎంబ్రాయి డరీ (Tailoring Embroidery)లో 88 మంది మహిళఅ భ్యర్థులలు శిక్షణ పూర్తి చేసుకు న్నట్లు తెలిపారు. ఈ విడత శిక్షణలో భాగంగా పురుష అభ్యర్థు లకు సీసీటీవీలో 13 రోజుల శిక్షణ , ఏసీ మరమ్మతులపై 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నల్గొండ శిక్షణ కేంద్రంలో సొంతంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్ర మంలో డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, తదిత రులు పాల్గొన్నారు.