Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని 19వ వార్డు లో సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కార్యనిర్వాకు కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (Narayana Reddy) కి వార్డు ప్రజలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని 19వ వార్డులో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో స్థానిక వార్డు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొం టున్నారని తెలిపారు. వార్డులోని శ్రీనగర్ కాలనీలో రోడ్ల సమస్యలు, రోడ్లు గుంతల మయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగు తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కనీసం నడవటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షం వచ్చిన రోజు అయితే సమస్యలు అధిక మవుతున్నాయన్నారు. అదేవిధం గా డ్రైనేజ్ సమస్యతో (Drainage problem) పాటు తాగు నీటి సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. వాటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బొంత రమేష్, గోగుల నాగరాజు, పెరిక యాదయ్య, బాలరాజు తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.